ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్ లో 250 పరుగులను 5 సార్లు ఛేజింగ్ చేసిన టీమ్ కు కెప్టెన్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు ధోనీ పేరిట ఉంది. ధోనీ తర్వాత బ్రియాన్ లారా, రికీ పాంటింగ్ మూడో ప్లేస్ లో ఉన్నారు. వీరిద్దరూ మూడు సార్లు 250 పైగా పరుగులు ఛేజింగ్ చేసిన జట్లకు కెప్టెన్ లుగా నిలిచారు.
స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లిష్ జట్టు గతేడాది న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా 277, 299, 296 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. అలాగే, గతేడాది జులైలో ఎడ్జ్‌బాస్ట్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో స్టోక్స్ ఖాతాలోకి ఈ రికార్డు వచ్చి చేరింది.
యాషెస్ సిరీస్‌లో భాగంగా హెడింగ్లీ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ విజయంలో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్(75) కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్(32 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా అధిక్యాన్ని 2-1కు ఇంగ్లండ్ తగ్గించింది