ఇంగ్లాండ్ తో జరగబోయే చివరి రెండు టెస్టులకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ఆదివారం (అక్టోబర్ 13) ప్రకటించిన జట్టులో మాజీ కెప్టెన్ బాబర్ అజామ్, షాహీన్ షా ఆఫ్రిది లపై వేటు సంచలన నిర్ణయం తీసుకుంది. పీసీబీ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయింది. ఈ త్రయాన్ని తొలగించడంపై పాక్ క్రికెట్ బోర్డు పై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు.
ముల్తాన్ వేదికగా పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్లు మంగళవారం (అక్టోబర్ 15) రెండో టెస్ట్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కు బాబర్, అఫ్రిది, నసీం షా లను తప్పించడంపై మీ స్పందనేంటి అని అడిగారు. దీనికి ఈ ఇంగ్లాండ్ కెప్టెన్ బదులిస్తూ.. "అదంతా పాకిస్థాన్ సమస్య. మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంపై నేను ఏమీ మాట్లాడలేను. మా దృష్టాంతా రెండో టెస్టు గెలవడంపైనే ఉంది" అని ఇంగ్లీష్ కెప్టెన్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
ALSO READ | ఒమర్ అబ్దుల్లాను కలిసిన రవిశాస్త్రి
ఈ మ్యాచ్ కోసం సోమవారం (అక్టోబర్ 14) ఇంగ్లాండ్ జట్టు ప్లేయింగ్ 11 ను ప్రకటించారు. గాయం కారణంగా చివరి నాలుగు టెస్టులకు దూరమైన ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ పై ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ గెలవాలని ఇంగ్లాండ్ భావిస్తుంది.