వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జట్టు చెలరేగి ఆడింది. పసికూన నెదర్లాండ్స్ పై విరుచుకు పడి ఈ లీగ్ లో తొలిసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేసింది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే నిష్క్రమించిన ఇంగ్లాండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకు అర్హత సాధించే పనిలో ఉంది. ఈ లీగ్ లో రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం నెదర్లాండ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో నెదర్లాండ్స్ ముందు భారీ స్కోర్ సెట్ చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 345 పరుగుల భారీ స్కోర్ చేసింది. చివరి వరల్డ్ కప్ ఆడుతున్న స్టోక్స్ సెంచరీ బాదేశాడు. 77 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న స్టోక్స్.. 84 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 108 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. స్టోక్స్ తో పాటు ఓపెనర్ మలన్ 87 పరుగులకు చేసి ఇంగ్లాండ్ కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు.
ఒక దశలో 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 133 పరుగులు చేసిన బట్లర్ సేన ఆ తర్వాత వ్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. దీంతో 192 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో స్టోక్స్ కు జత కలిసిన వోక్స్(51) 129 భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బేస్ డీ లీడ్ 3 వికెట్లు తీసుకోగా.. ఆర్యన్ దత్, వాన్ భీక్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
We finish our overs in Pune on 3️⃣3️⃣9️⃣
— England Cricket (@englandcricket) November 8, 2023
Chris Woakes 51 (45)
Dawid Malan 87 (74)
Ben Stokes 108 (84)
Well batted, lads ?#EnglandCricket | #CWC23 pic.twitter.com/OAUBYQTemp