SA20, 2025: ఒకే జట్టులో స్టోక్స్, బోల్ట్, రషీద్ ఖాన్.. దుర్బేధ్యంగా ముంబై

సౌతాఫ్రికా 20 లీగ్ లో ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తుంది. 2025 సౌతాఫ్రికా 20 లీగ్ కోసం ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్టులో ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ చేరాడు. అతన్ని ముంబై జట్టులోకి తీసుకుంటున్నామని ఆ జట్టు  ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. స్టోక్స్‌కి ఇది తొలి సౌతాఫ్రికా టీ20 లీగ్. స్టోక్స్ తో పాటు ఆఫ్ఘనిస్థాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఓమార్జాయిని  ముంబై జట్టు తీసుకుంది.

ఇప్పటికే ఈ జట్టులో అంతర్జాతీయ మ్యాచ్ విన్నర్లు రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్ ఉన్న సంగతి తెలిసిందే. వీరితో పాటు నువాన్ తుషారా, క్రిస్ బెంజమిన్,కగిసో రబడా లతో పటిష్టంగా కనిపిస్తుంది. హండ్రెడ్ లీగ్ లో భాగంగా మాంచెస్టర్ ఒరిజినల్స్ పేసర్ ఆలీ రాబిన్‌సన్‌ బౌలింగ్ లో స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో స్టోక్స్ కు గాయమైంది. దీంతో అతను ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేని పరిస్థితి. సౌతాఫ్రికా టీ20 సీజన్ జనవరి 9 నుండి ఫిబ్రవరి 8 వరకు జరుగుతుంది. ఇప్పటివరకు ఈ లీగ్ రెండు సీజన్ లు జరిగింది. రెండు సార్లు సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్స్ టైటిల్ విజేతగా నిలిచింది.      

MI కేప్ టౌన్ స్క్వాడ్:

బెన్ స్టోక్స్, రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నువాన్ తుషార, క్రిస్ బెంజమిన్, కగిసో రబడా, డెవాల్డ్ బ్రెవిస్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, డెలానో పోట్‌గీటర్, థామస్ కబెర్ మరియు కానర్ ఎస్టర్‌హుజెన్.