NZ vs ENG: చిక్కుల్లో స్టోక్స్.. ఐసీసీకి కౌంటర్ విసిరిన ఇంగ్లాండ్ కెప్టెన్

NZ vs ENG: చిక్కుల్లో స్టోక్స్.. ఐసీసీకి కౌంటర్ విసిరిన ఇంగ్లాండ్ కెప్టెన్

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా ఇటీవలే ముగిసిన తొలి టెస్టులో స్లో ఓవర్‌రేట్‌ వేసినందుకు కాను ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లకు ఐసీసీ మూడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లు కోత విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు జట్ల పాయింట్ల శాతంలో భారీ మార్పు సంభవించింది. ఓ వైపు ఇంగ్లాండ్ గెలిచినా పూర్తి సంతృప్తితో లేకపోగా.. మరోవైపు కివీస్ కు ఓటమితో పాటు మరో మూడో పాయింట్స్ మైనస్ పడ్డాయి. స్లో ఓవర్ రేట్ కారణంగా తమ జట్టుకు జరిమానా విధించినందుకు ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐసీసీపై మండిపడ్డాడు. 

ఇంస్టాగ్రామ్ వేదికగా ఐసీసీపై కౌంటర్ విసిరాడు. ఐసీసీ చేసినందుకు గాను తన నిరాశను వ్యక్తం చేస్తూ "గుడ్ ఆన్ యు ఐసీసీ" మూడు భుజాలు తడుముతున్న ఎమోజీలను కింద ఉంచాడు. దీని తర్వాత కింద "ఇంకా 10 గంటల ఆట మిగిలి ఉండగానే గేమ్‌ను ముగించాం. " అని స్టోక్స్ తన ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చాడు. స్టోక్స్ చేసిన వ్యాఖ్యలకు ఐసీసీ చర్యలు తీసుకున్నా ఆశ్చర్యం లేదు. ఐసీసీ ఏదైనా రూల్స్ ప్రకారమే చేస్తుంది. పైగా మ్యాచ్ తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు తమ తప్పును అంగీకరించారు. మరి ఈ విషయం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి. 

ఈ మ్యాచ్ లో స్లో ఓవరేట్ తో పాటుగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లకు మ్యాచ్ ఫీజ్ లో 15 శాతం జరిమానా విధించింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 47.92 శాతంతో ఐదో స్థానంలో.. 42.50 శాతంతో ఇంగ్లాండ్ ఆరో స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లాండ్ ఇప్పటికే టెస్ట్ ఛాంపియన్ షిప్ అవకాశాలు దాదాపు కోల్పోగా.. కివీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో న్యూజి లాండ్ పై గెలిచింది. కివీస్ విధించిన 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి 12.4 ఓవర్లలో ఛేదించారు.