ENG vs WI 2024: టెస్టుల్లో స్టోక్స్ అరుదైన ఘనత.. దిగ్గజాల సరసన ఇంగ్లాండ్ కెప్టెన్

ఇంగ్లాండ్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ టెస్టుల్లో ఒక అరుదైన రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆల్ రౌండర్ గా అదరగొడుతూ దిగ్గజాల సరసన చేరాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్ రౌండర్ స్టోక్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఫార్మాట్ లో బ్యాటర్ గా 6000 పరుగులు పూర్తి చేసుకోవడమే కాదు.. బౌలింగ్ లోనూ 200 వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టు క్రికెట్ లో ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్ గా నిలిచాడు.

Also Read: ఐపీఎల్ తర్వాత అతి పెద్ద లీగ్.. బిగ్ బాష్ షెడ్యూల్ ప్రకటన

గురువారం (జూలై 11) వెస్టిండీస్ తో లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ మొదలైంది. మొదటి రోజు ఆటలో భాగంగా విండీస్  ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ మూడో బంతికి కిర్క్ మెకెంజీని అవుట్ చేయడంతో బెన్ స్టోక్స్ టెస్టుల్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అంతకముందు బ్యాటింగ్ లో 6000 పరుగులు చేశాడు. 

ఇప్పటివరకు బౌలింగ్ లో 200 వికెట్లు.. బ్యాటింగ్ లో 6000 కు పైగా పరుగులు చేసిన క్రికెటర్ల లిస్టులో వెస్టిండీస్ దిగ్గజం సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్, సౌతాఫ్రికా మాజీ స్టార్ జాక్వెస్ కల్లిస్‌లో మాత్రమే ఉన్నారు. 93 టెస్టుల్లో సోబర్స్ 34.03 సగటుతో 235 వికెట్లు పడగొట్టాడు. వీటిలో 8 సార్లు నాలుగు వికెట్లు.. ఆరుసార్లు ఐదు వికెట్లు ఉన్నాయి. బ్యాటింగ్ లో 57.78 సగటుతో 8032 పరుగులు చేశాడు. వీటిలో 26 సెంచరీలు.. 30 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 

దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కల్లిస్‌ ఆల్ రౌండర్ గా ప్రపంచ క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. బౌలింగ్ లో 292 వికెట్లు పడగొట్టాడు. వీటిలో 7 సార్లు నాలుగు వికెట్ల ఘనత.. 5 సార్లు నాలుగు వికెట్ల ఘనత సాధించాడు. బ్యాటింగ్ లో 55.37 సగటుతో 13289 పరుగులు చేశాడు. వీటిలో 45 సెంచరీలు.. 58 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.