వరల్డ్ కప్ ముంగిట ఇంగ్లండ్ అభిమానులకు తీపి కబురు అందింది. ఆజట్టు ఆల్‌రౌండర్, విధ్వంసకర ఆటగాడు బెన్ స్టోక్స్ తన వన్డే రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. భారత్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో బరిలోకి దిగేందుకు తాను సిద్ధమని వెల్లడించాడు. ఈ క్రమంలో సెలెక్టర్లు అతనిని న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు.
బెన్ స్టోక్స్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని.. మరోసారి దేశానికి ఆడాలని ఆ జట్టుహెడ్‌కోచ్ మాథ్యూ మాట్ కొద్దిరోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతను తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. స్టోక్స్ నిర్ణయంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈసీబీ.. ట్విట్టర్ వేదికగా 'బిగ్ మ్యాన్ ఈజ్ బ్యాక్' అంటూ ట్వీట్ చేసింది.
The big man is back ?
— England Cricket (@englandcricket) August 16, 2023
Luke Wright on the sensational return of Ben Stokes to ODI cricket... ?
స్టోక్స్ వీరోచిత పోరాటం
క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్‌కు 2019 వరకూ ప్రపంచ కప్ అనేది అందని ద్రాగానే ఉండేది. ఆ కలను 2019లో బెన్ స్టోక్స్ తీర్చాడు. ఆ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో స్టోక్స్( 84 నాటౌట్) వీరోచితంగా పోరాడి మ్యాచ్‌ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లాడు. అనంతరం బౌండరీల కౌంట్ ద్వారా ఇంగ్లండ్ కప్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 105 వన్డేలు ఆడిన స్టోక్స్.. 2,924 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
న్యూజిలాండ్‌తో తలపడే ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్(కెప్టెన్), మోయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కరన్, లియాం లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీసీ టాప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్.