- రికార్డ్ గరిష్టాలకు సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు గురువారం సెషన్‌లో కూడా కొత్త గరిష్టాలను టచ్ చేశాయి. కానీ, ఓపెనింగ్ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లు పెరగడంతో పాటు, గ్లోబల్ మార్కెట్‌లు పాజిటివ్‌గా కదలడంతో సెన్సెక్స్ గురువారం ట్రేడ్‌లో 80,392.64 దగ్గర ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. కానీ ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకోవడంతో చివరికి 63 పాయింట్ల లాభంతో 80,050 దగ్గర ముగిసింది.
ఇది క్లోజింగ్ బేసిస్‌లో సెన్సెక్స్‌కు ఆల్ టైమ్ హై. నిఫ్టీ కూడా గురువారం ఇంట్రాడేలో 24,401 దగ్గర రికార్డ్ గరిష్టాన్ని టచ్ చేసి, చివరికి 16 పాయింట్ల లాభంతో 24,302 దగ్గర సెటిలయ్యింది. ఇది కూడా క్లోజింగ్ బేసిస్‌లో ఆల్ టైమ్ హై. ఐటీ, ఫార్మా సెగ్మెంట్‌లోని లార్జ్ క్యాప్‌లలో కొనుగోళ్లు పెరుగుతున్నాయని, యూఎస్ ఇన్‌ఫ్లేషన్ తగ్గుతుండడం, అక్కడి కంపెనీల క్వార్టర్లీ రిజల్ట్స్ బాగుండడంతో యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ దిగొస్తోందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు.