ముంబై: వరుసగా మూడు సెషన్లలో నష్టాల్లో కదిలిన బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు బుధవారం లాభపడ్డాయి. గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవ్వడంతో పాటు, ఐటీ, ఆయిల్ షేర్లు పెరగడంతో నిఫ్టీ, సెన్సెక్స్ ఒక శాతానికి పైగా ర్యాలీ చేశాయి. నిఫ్టీ బుధవారం 305 పాయింట్లు (1.27 శాతం) లాభపడి 24,298 దగ్గర, సెన్సెక్స్ 875 పాయింట్లు పెరిగి 79,468 దగ్గర సెటిలయ్యాయి.
సెన్సెక్స్‌లో అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, ఎల్ అండ్ టీ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. మరోవైపు ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎయిర్‌టెల్, హిందుస్తాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, టైటాన్ షేర్లు నష్టాల్లో క్లోజయ్యాయి. అన్ని సెక్టార్ల ఇండెక్స్‌లు పాజిటివ్‌గా కదలగా, మెటల్, ఎనర్జీ, ఫార్మా ఇండెక్స్‌లు మాత్రం ఎక్కువగా పెరిగాయి. ‘ఫైనాన్షియల్‌గా అనిశ్చితి నెలకొన్న పరిస్థితిల్లో వడ్డీ రేట్లను పెంచమని బ్యాంక్ ఆఫ్ జపాన్ డిప్యూటి గవర్నర్ ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లు ర్యాలీ చేశాయి.
ఇండియన్ మార్కెట్‌లో కూడా అన్ని సెక్టార్లలో కొనుగోళ్లు కనిపించాయి. ఇండెక్సేషన్ బెనిఫిట్స్‌ను తిరిగి అందుబాటులో ఉంచడంతో రియల్టీ సెక్టార్ షేర్లు రిలీఫ్ ర్యాలీ చేశాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. బ్రాడ్ మార్కెట్ చూస్తే బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ బుధవారం 2.63 శాతం పెరగగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2.39 శాతం పెరిగింది.
బీఎస్‌ఈలో 2,985 షేర్లు లాభాల్లో, 948 షేర్లు నష్టాల్లో ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.3,314.76 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (డీఐఐ) నికరంగా రూ.3,901 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గ్లోబల్ మార్కెట్లలో జపాన్ నికాయ్ 225 ఇండెక్స్ 2.5 శాతం లాభపడగా, సౌత్ కొరియా కొస్పీ రెండు శాతం పెరిగింది. షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు పాజిటివ్ ట్రేడయ్యాయి.