సెన్సెక్స్ @ 80,000

సెన్సెక్స్ @  80,000
  • రూ.445.43 లక్షల కోట్లకు చేరుకున్న బీఎస్​ఈ లిస్టెడ్ సంస్థల ఎంక్యాప్ 

ముంబై: ఈక్విటీలలో ర్యాలీ కారణంగా బెంచ్‌‌మార్క్ సెన్సెక్స్ మొదటిసారిగా చారిత్రాత్మక 80 వేల మార్క్‌‌ను అధిగమించింది.   సెన్సెక్స్ బుధవారం ప్రారంభంలో తొలిసారిగా 80 వేల మార్కును తాకింది. ఇది 632.85 పాయింట్లు పెరిగి ఇంట్రా-డే గరిష్ట స్థాయి 80,074.30ని టచ్ చేసింది. చివరికి 545.35 పాయింట్లు పెరిగి 79,986.80 వద్ద ముగిసింది.  దీంతో బీఎఎస్​ఈ -లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్  రికార్డు గరిష్ట స్థాయి రూ.4,45,43,642.29 కోట్లు చేరింది.  

బీఎస్ఈ సెన్సెక్స్ జూన్ 25వ తేదీన 78,000 స్థాయిని, జూన్ 27న తొలిసారిగా 79,000 స్థాయిని అధిగమించింది.   సెన్సెక్స్ ప్యాక్‌‌లో, అదానీ పోర్ట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌‌ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పవర్ గ్రిడ్, జెఎస్‌‌డబ్ల్యు స్టీల్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ అత్యధికంగా లాభపడ్డాయి. అయితే,  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ , లార్సెన్ అండ్ టూబ్రో వెనకబడి ఉన్నాయి. 

బీఎస్‌‌ఈ మిడ్‌‌క్యాప్ గేజ్ 0.86 శాతం, స్మాల్‌‌క్యాప్ ఇండెక్స్ 0.86 శాతం పెరిగాయి.  ఇండెక్స్‌‌లలో బ్యాంకెక్స్ 1.75 శాతం ర్యాలీ చేయగా, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.55 శాతం ఎగబాకింది.  టెలికమ్యూనికేషన్ 1.44 శాతం, సేవలు 1.18 శాతం, పారిశ్రామిక 1.09 శాతం, ఎఫ్‌‌ఎంసీజీ 0.81 శాతం లాభపడ్డాయి.