
వనపర్తి, వెలుగు: జిల్లా కేంద్రంలోని డబుల్ బెడ్రూం కాలనీలో సమస్యలు పరిష్కరించాలని లబ్ధిదారులు కోరారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పాయిపల్లి, పీర్లగుట్ట, రాజపేట, పెద్దగూడెం, చిట్యాల రోడ్డులోని డబుల్ బెడ్రూం కాలనీల్లో మంచినీటి సమస్య ఉందని తెలిపారు. వీధి దీపాలు, సీసీ రోడ్లు, సెప్టిక్ ట్యాంకులు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గత ప్రభుత్వం రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోయిన తమకు ఇండ్లు కేటాయించినా, సౌలతులు కల్పించలేదని పేర్కొన్నారు.
పెద్దగూడెం గుట్ట ప్రాంతంలో ఇండ్లు నిర్మించడంతో ఇండ్లల్లోకి వన్యప్రాణులు వస్తున్నాయని తెలిపారు. పీర్లగుట్ట, పెద్దగూడెం కాలనీల్లో ప్రహరీ గోడ నిర్మించాలని కోరారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి వినతిపత్రం అందించారు. మండ్ల రాజు, గోపాలకృష్ణ, సాయిలీల, సుజాత, జమీర్, నిరంజన్, సురేంద్రబాబు, భూదేవి, రాములమ్మ, నంబి శ్రీనివాసులు పాల్గొన్నారు.