డబుల్ బెడ్‌ రూం ఇండ్లు పంపిణీ చేయాలని ధర్నా

డబుల్ బెడ్‌ రూం ఇండ్లు పంపిణీ చేయాలని ధర్నా
  • తహసీల్దార్ ఆఫీసు ఎదుట ధర్నా 

 ఎల్లారెడ్డి, వెలుగు : ఎల్లారెడ్డి పట్టణ పరిధిలోని సోమార్ పేట్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆదివారం ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇద్దరు లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేశారు. దీంతో  మిగతా లబ్ధిదారులకు రెవెన్యూ కార్యాలయానికి మాకు కూడా ఇండ్లు పంపిణీ చేయాలని ప్రశ్నించారు. దీంతో అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో తహసీల్దార్ ఆఫీసు ఎదుట లబ్ధిదారులు ధర్నా చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  గతంలో డ్రా పద్ధతిలో  అర్హులను ఎంపిక చేశారన్నారు.

అందులో తాము కూడా ఎంపిక అయ్యామని తమకు ఇండ్లు ఎప్పుడు ఇస్తారని అడిగితే సమాధానం చెప్పేవారు కరవయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు.  విషయం తెలుసుకున్న ఆర్డీఓ మన్నె ప్రభాకర్,  స్థానిక ఇన్‌చార్జి తహసీల్దార్ చరణ్ సింగ్‌ను సంఘటన స్థలానికి పంపి సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు