డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్ రూంల కోసం లబ్ధిదారుల ఆందోళన

డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్ రూంల కోసం లబ్ధిదారుల ఆందోళన

కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన 240  డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్ రూం ఇండ్లను గతంలో కేటాయించిన వారికి వెంటనే అప్పగించాలని లబ్ధిదారులు బుధవారం ఆందోళన చేశారు.   ఈ సందర్భంగా తహాసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేసి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.  

డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూం ఇండ్లలో కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మంచినీటి సదుపాయం కల్పించి తమకు అప్పజెప్పాలని కోరారు.  స్పందించిన మున్సిపాలిటీ అధికారులు లబ్ధిదారులను శాంతింప జేసి అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్ రూం ఇండ్లను త్వరలోనే అందిస్తామని తెలిపారు.