బెనిఫిట్​ షోలు బంద్​..మీ షోల కోసం జనం ప్రాణాలు తీస్తరా?

  • మహిళ చనిపోయినా సినిమా హీరో స్పందించరా?
  • పుష్ప 2 టీమ్​పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఫైర్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్పష్టం చేశారు. బెనిఫిట్​ షోలతో మనుషుల ప్రాణాలు తీస్తరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్​ షో సందర్భంగా సంధ్య థియేటర్​ వద్ద తొక్కిసలాట, మహిళ మృతి చెందిన ఘటనపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. 

‘‘అలాంటి షోలకు సినిమా హీరోలు వెళ్లడం ఎంత వరకు కరెక్ట్​?  బెనిఫిట్ షోలతో మనుషుల ప్రాణాలు తీస్తరా?  సంధ్య థియేటర్​ ఘటనపై ఇప్పటి వరకు సదరు సినిమా హీరో స్పందించకపోవడం బాధాకరం. పోయిన మనిషి ప్రాణం వారు తీసుకొస్తరా?” అని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్​లో మంత్రి వెంకట్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. మృతురాలి కుటుంబాన్ని సినిమా హీరో, నిర్మాతలు ఆదుకోవాలన్నారు.