Good Food : కిస్మిస్.. తింటే బలం వస్తుంది.. ఇన్ఫెక్షన్ తగ్గుతుంది..!

Good Food : కిస్మిస్.. తింటే బలం వస్తుంది.. ఇన్ఫెక్షన్ తగ్గుతుంది..!

ఎండు ద్రాక్ష పాయసంలో, చాలా రకాల స్వీట్స్ లో ఖచ్చితంగా వాడే పదార్థం. దీనిని వాడటం వల్ల టేస్ట్ కూడా పెరుగుతుంది. దీన్ని కిస్మిస్ అని కూడా పిలుస్తారు. వంటల్లో వాడటం మాత్రమే కాకుండా చాలా మంది నేరుగా కూడా తింటూ ఉంటారు. ఎలా తిన్నా దాని టేస్టే వేరు, తీపి వంటకాలకు అదనపు కుచిని అందించడంలో ఎండుద్రాక్ష స్పెషాలిటీ అని చెప్పచ్చు. చూడడానికి ఎండిపోయి పీలగా ఉన్నప్పటికీ  శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో మాత్రం దీని తర్వాతే ఏదైనా అని చెప్పచ్చు. 

ఎండుద్రాక్షలో విటమిన్-బి. ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నిషియం. పొటాషియం ఆమైనో ఉంటాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఏ వయసు వారైనా ఎండుద్రాక్ష హాలుగా తినేయొచ్చు.ఎండుద్రాక్షల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టుకొని ఉదయాన్నే పరగడుపున తింటే ఆమ్లాలు పుష్కలంగా లభిస్తుంది.ఆరోగ్య సమస్యలని దూరం పెట్టొచ్చు.

అధిక బరువుతో బాధపడేవారికి ఎండుద్రాక్ష మంచి రుచికరమైన ఔషధం ఇవి మన శరీరంలో ఆకలిని పిండే లెప్టిన్ అనే రసాయనం విడుదలను నియంత్రిస్తుంది. బరువు తగ్గాలను కునేవారు ఎండుద్రాక్ష ను క్రమం తప్పకుండా తీసుకుంటే అనవసరంగా తినటం తగ్గి త్వరగా బరువు తగ్గచ్చు. జీర్ణ సమస్యలతో బాధపడే వారికి కూడా ఇది మంచి ఔషధం అని చెప్పచ్చు.