వర్షాకాలం వచ్చేసింది.. తొలకరి చినుకులతో పాటు తనతో పాటు జలుబు, దగ్గు వంటి సీజనల్ సమస్యలను కూడా తన వెంట తెస్తుంది వర్షాకాలం. మొన్నటిదాకా మండే ఎండలతో అల్లాడిన జనం వర్షాలను ఆస్వాదిస్తున్నారు. అయితే, వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే జలుబు, దగ్గు, చర్మ వ్యాధులు వంటి సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి మన వంటింట్లోనే ఒక మెడిసిన్ ఉంది. మనం వంటల్లో రోజు వాడే అల్లమే ఆ మెడిసిన్. అవును మనం రోజు తాగే టీ బదులుగా అల్లం టీ అలవాటు చేసుకుంటే వర్షంకాలంలో ఇబ్బంది పెట్టే చిన్న చిన్న సమస్యలు ఏవీ రాకుండా చూసుకోవచ్చు.
అల్లం టీ వల్ల కలిగే లాభాలు:
జలుబు, దగ్గు నుండి ఉపశమనం:
వర్షాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు సహజం.ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం అందించటంలో అల్లం టీ బాగా పని చేస్తుంది. అల్లంలో ఉండే పోషకాలు జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుండి త్వరిత ఉపశమనం ఇస్తాయి.
రోగనిరోధక శక్తి పెంచుతుంది:
అల్లంలో ఉండే పోషక విలువలు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఎనాటగానో తోడ్పతాయి. వర్షాకాలంలో క్రమం తప్పకుండా అల్లం టీ తాగటం వల్ల వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండచ్చు.
శ్వాసకోశ సమస్యల దరిచేరవు:
వర్షాకాలంలో రెగ్యులర్ గా అల్లం టీ తీసుకోవటం వల్ల శ్వాసకోశ సమస్యల బారిన పడకుండా ఉండచ్చు. ఇది తాగటం వల్ల శ్వాసకోశ నాళం క్లియర్ అయ్యి ఎలాంటి ఇబ్బందులు మన దరిచేరకుండా కాపాడుతుంది.
బరువు తగ్గటంలో తోడ్పడుతుంది:
అల్లంలో ఉండే పోషకాలు బరువు తగ్గటంలో ఎంతగానో తోడ్పడతాయి.మెటబాలిజం ని గాడిలో పెట్టి కొవ్వును కరిగించటంలో అల్లం తోడ్పడుతుంది.
వికారం, జీర్ణ సమస్యల నుండి కాపాడుతుంది:
వర్షాకాలంలో సహజంగా వచ్చే వికారం, జీర్ణ సమస్యలు రాకుండా అల్లం తోడ్పడుతుంది.
ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం:
అల్లం టీ క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుండి దూరంగా ఉండచ్చు.