
పెరుగు, పెరుగు అన్నం అంటే చాలు.. చాలా మంది తినరు. పెరుగు తింటే నిద్రొస్తుందని.. పెరుగన్నం తింటే బద్దకం అని.. పెరుగన్నం అరగదని.. పెరుగన్నం వల్ల లావు వస్తారని.. పెరుగన్నం తింటే జలుబు చేస్తుందని.. ఇలా చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. అంతెందుకు జలుబు, దగ్గు చేసినా వారాలు తరబడి పెరుగన్నం మానేసే వారు చాలా మంది ఉన్నారు. డైట్ ఫాలో అయ్యేవారు పెరుగును చాలా చాలా తక్కువగా తీసుకుంటారు.. వాస్తవంగా పెరుగన్నం వల్ల.. ముఖ్యంగా ఐదు ఆరోగ్య ప్రయోగాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం...
బరువు తగ్గడంలో..
తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావాలంటే రోజూ వారి ఆహారంలో పెరుగన్నాన్ని చేర్చుకోవాలి. ఇది ఆరోగ్యకరమైనదే కాదు.. తక్కువ కేలరీలను కూడా కలిగి ఉంటుంది.
శక్తినిస్తుంది..
ఒక గిన్నె పెరుగన్న రోజంతా శక్తిమంతంగా ఉండడానికి సహకరిస్తుంది. పెరుగులో ఉండే పిండిపదార్ధాలు ఎంజైమ్ ల ద్వారా విచ్చిన్నం చేయబడి జీర్ణమవుతాయి, అవసరమైన శక్తిని అందిస్తాయి.
ఒత్తిడి తగ్గించేందుకు..
ఈ భోజనం రుచిగా ఉండడమే కాకుండా అద్భుతమైన స్ట్రెస్ బస్టర్ కూడా. ప్రోబయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మంచి కొవ్వులతో నిండిన పెరుగన్న ఒత్తిడిని దూరం చేస్తుంది.
బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తుంది..
పెరుగన్నంలో సోడియం తక్కువగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నివారిస్తుంది. మెగ్నిషియం, ఐరన్ లు రక్త ప్రవాహంలో ఉప్పు ప్రభావాన్ని భర్తీ చేస్తుంది.
మెరుగైన జీర్ణక్రియకు..
పెరుగులో ఉండే ప్రోబయోటిక్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. లాక్టోబాసిల్లన్ బల్గారికస్ కడుపుని చల్లగా ఉంచుతుంది.