వానాకాలంలో మక్కల సాగు వద్దంటే ఎవరూ వేయలే దని, ఇది గొప్పమార్పుఅని సీఎం కేసీఆర్ అన్నారు. ని యంత్రిత సాగు వందకు వంద శాతం సక్సెస్ అవ్వడం గొప్ప పరిణామమని చెప్పారు. రాష్ట్రంలో రైతుబంధు అందని రైతులు ఏ మూలన ఉన్నా వాళ్లను గుర్తించి సాయం అందజేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. రైతుబంధు సాయం అందించడానికి టైమ్ లిమిట్ అంటూ ఏమీ లేదని, ఎంత ఖర్చయినా ప్రభుత్వం వె నుకాడబోదని ఆయన చెప్పారు. గత నెల 28న ఫామ్ హౌస్ కు వెళ్లిన సీఎం కేసీఆర్ 13 రోజుల తర్వాత శనివారం తిరిగి ప్రగతి భవన్ కు వచ్చారు. వ్యవసాయ శాఖపై మంత్రులు, అధికారులతో ఆయన సమీక్షించా రు. కరోనా కష్టకాలంలోనూ ఆర్ధిక పరిస్థి తి అంతంత మాత్రంగానే ఉన్న రైతుబంధు సాయం విడుదల చేశా మన్నారు. ఇప్పటికే 99.99 శాతం మందికి సాయం అందిందని ఆయన చెప్పారు. వందకు వందశాతం రైతులు నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నా రని సీఎం చెప్పారు. రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడానికే ఈ పద్ధతిని సూచించామని, రైతుల్లోని చైతన్యం, ఐక్యత, స్పందన ప్రభుత్వానికి ఎంతో స్ఫూర్తినిస్తున్నదని పేర్కొన్నారు. రైతు బంధు సాయం రాని రైతులు ఉంటే.. వారి ఖాతాల్లోవెంటనే సాయం జమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిట్టచివరి రైతువరకు రైతుబంధు సాయం అందించాలని సూచించారు. క్లస్టర్ల వారీగా ఎందరికి రైతుబంధు అందింది.. ఇంకా ఎవరైనా మిగిలిపోయారా.. అనే వి వరాలతో ఎంఈవోలు రిపోర్ట్ఇవ్వాలని ఆయన ఆదేశించారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లుజరిగితే ఆ వివరాలు రిపోర్టులో ఉండాలన్నారు. రైతు వేదికల నిర్మాణాలు మొదలయ్యాయని, వాటిని దసరా నాటికి వాటిని పూర్తి చేయాలన్నారు. మోకా మైనా నిర్వహించాలి కొంత మంది రైతులకు తమ భూములు కాస్తులో ఉన్నప్పటికీ యాజమాన్య హక్కులు లేక రైతుబంధు సాయం అందడం లేదని, అలాంటి వారిని కలెక్టర్లు గుర్తించాలని సీఎం ఆదేశించారు. యాజమాన్య హక్కు లను గుర్తించడానికి మోకా మైనా (స్పాట్ ఎంక్వైరీ ) నిర్వహించాలని, చుట్టుపక్కల రైతులను విచారించి కాస్తులో ఉన్న వారికి భూమిపై హక్కులు కల్పించాల ని సూచించారు. ‘‘మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామా నికి అసలు రెవెన్యూ రికార్డే లేదు. ఆ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి చొరవతో ప్రభుత్వం గ్రామంలో సర్వే జరిపింది. ఏ భూమికి ఎవరు యజమానో నిర్ధా రించింది. మిగతా చోట్ల కూడా అదే జరగాలి’’ అని సీఎం అన్నారు. రూ. 25 కోట్ల తో అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టో రేజీ రైతులకు అవసరమైన మేలు రకమైన విత్తనాలను అగ్రికల్చర్ యూనివర్సిటీ, సీడ్ డెవలప్మెంట్ కా ర్పొరేషన్ చేపట్టాయని సీఎం పేర్కొన్నారు. తయారు చేసిన విత్తనాలను నిల్వ చేయడానికి రూ.25 కోట్లతో అతిపెద్దఅల్ట్రామోడర్న్ కోల్డ్స్టోరేజీ నిర్మిస్తామన్నారు. వెంటనే నిధులు విడుదల చేస్తామని, యేడాదిలోగా నిర్మాణం పూర్తి చేయాలని ఆఫీసర్లకు సూచించారు. సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
99.99 శాతం మందికి రైతు బంధు సాయం అందించాం
- తెలంగాణం
- July 12, 2020
మరిన్ని వార్తలు
-
Marcus Stoinis: క్రికెట్ ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన మార్కస్ స్టోయినిస్
-
RC16: రామ్ చరణ్ RC16 షూటింగ్ స్పాట్‌కు మెగా ప్రిన్సెస్ క్లీంకార.. ఫోటో వైరల్
-
ఆ లిస్ట్‌లో మీ పేరు ఉంటే ఫ్రీ రేషన్ కట్.. లిస్ట్ తెప్పించుకుంటున్న కేంద్రం..
-
Viral Video : పోలీసుకు పెళ్లయింది.. వధువును కొట్టాడు..ఉద్యోగం ఊడింది..
లేటెస్ట్
- Marcus Stoinis: క్రికెట్ ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన మార్కస్ స్టోయినిస్
- RC16: రామ్ చరణ్ RC16 షూటింగ్ స్పాట్‌కు మెగా ప్రిన్సెస్ క్లీంకార.. ఫోటో వైరల్
- ఆ లిస్ట్‌లో మీ పేరు ఉంటే ఫ్రీ రేషన్ కట్.. లిస్ట్ తెప్పించుకుంటున్న కేంద్రం..
- Viral Video : పోలీసుకు పెళ్లయింది.. వధువును కొట్టాడు..ఉద్యోగం ఊడింది..
- ATM నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!
- సంకెళ్లేసి గెంటేసినా మౌనంగానే ఉంటారా..? ప్రధాని మోదీ తీరుపై ఇండియా కూటమి నిరసన
- Dimuth Karunaratne: కెరీర్లో చివరి మ్యాచ్.. శ్రీలంక క్రికెటర్‌కు సచిన్‌ని మించిన గౌరవం
- Yellamma: ఎల్లమ్మ వచ్చేస్తోంది.. దర్శకుడు బలగం వేణు రెండో మూవీ అప్డేట్
- రేపు (ఫిబ్రవరి 7) ఆర్బీఐ మానిటరీ పాలసీ.. వడ్డీ రేట్లు తగ్గిస్తారా.. స్టాక్ మార్కెట్ దారెటు..?
- IND vs ENG: ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడుగుతారా.. రిటైర్మెంట్పై రోహిత్ ఆగ్రహం
Most Read News
- గుడ్ న్యూస్..రైతు భరోసా డబ్బులు పడ్డయ్..మీ అకౌంట్ చెక్ చేసుకోండి
- Health Tips: చికెన్, మటన్ లివర్‌లో.. విటమిన్ A, B12 పుష్కలం..వండే విధానం చాలా ముఖ్యం
- మీ బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ కావాలా.. Moto G85పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు
- VijayRashmika: రష్మిక మందన్నకు సహాయం చేయని విజయ్ దేవరకొండ.. నెటిజన్స్ ఫైర్
- Beauty Tips : నలుగు పిండిని ఇలా తయారు చేసుకోవాలి.. చర్మానికి నిగనిగ గ్యారంటీ..!
- నటుడు వేణుపై కేసు నమోదు
- Govt Jobs: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత.. నెలకు రూ.72వేల జీతం
- రైతుల ఖాతాల్లోభరోసా డబ్బులు
- Govt Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి
- నీ పనే బాగుందిరా: వాడు పెద్ద దొంగ.. 3 కోట్లతో సినీ నటికి విల్లా కొనిచ్చాడు..!