
వినాయక చవితి భారతీయులకు అతిముఖ్య పండుగలలో ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుడు కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసము శుక్ల చతుర్థి శుభ సమయంలో హస్త నక్షత్రమున రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. ఆ ఏకవింశతి పత్రాలు ఆయుర్వేద పరంగా మనిషికి ఎంత ఉపయోగకరంగా ఉపయోగపడుతున్నాయో గమనిద్దాం....
మాచీ పత్రం: అనగా మాచ పత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి. ఇది కుష్ఠు సంబంధ వ్యాధులను, బొల్లివంటి చర్మవ్యాధులను, నరాల సంబంధవ్యాధులను తగ్గిస్తుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఈ పత్రాలున్న పరిసరాల్లో ఎటువంటి సూక్ష్మక్రిములు దరిచేరవు.
బృహతీపత్రం: దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి. ఈ పువ్వులు మరియు పండ్లు సమర్పిస్తే గణేశుడు త్వరగా ప్రసన్నుడవుతాడు... ఇది ఆయాసాన్ని, దగ్గును, మలబద్ధకము, అతి విరేచనాలను తగ్గిస్తుంది. బాలింతలకు ఈ చెట్టు ఒక వరం. ఇది అనేక దివ్యౌషధాల తయారీకి ఉపయోగపడుతుంది.
బిల్వపత్రం: బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడ ఇష్టమైందిగా చెపుతారు. ఇది నీటిని శుద్ధి చేస్తుంది. కీళ్ల సంబంధవ్యాధులను, విరేచనాలను తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను శ్రీ వృద్ధిచేస్తుంది. శరీర దుర్వాసనను తగ్గిస్తుంది. అనేక ఔషధాల తయారీలో ఉపయోగపడుతుంది. సూక్ష్మక్రిమి సంహారిణిగా బాగా ఉపయోగపడుతుంది.
దూర్వా పత్రం: దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి. ఇది దేహంలో రక్తాన్ని శుద్ధిచేస్తుంది. అధికరక్తస్రావాన్ని, రక్తహీనతను తగ్గిస్తుంది.. శరీరంలోని హానికర సూక్ష్మక్రిములను నశింపజేస్తుంది. అజీర్ణవ్యాధిని, అధిక ఆమ్లస్రావాన్ని తగ్గిస్తుంది. సకల చర్మరోగాలను, సోరియాసిస్ లాంటి వ్యాధులను తగ్గిస్తుంది.
దత్తూర పత్రం: దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి. ఊపిరితిత్తులను వ్యాకోచింప చేసి ఉబ్బసం తగ్గేలా చేస్తుంది. బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి. చర్మ వ్యాధులకు మంచి. విరుగుడు జరిగి ఉంటుందని వైద్యశాస్త్రంలో పేర్కొన్నారు. అపామార్గ పత్రాన్ని తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి. ఇది దగ్గు, ఉబ్బసానికి బాగా పని చేస్తుంది..
తులసీ పత్రం: తులసీ పత్రం .. దీని హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. ఇది శరీరంలో ఉష్ణాన్ని నియంత్రిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి చెట్టుఉండాలి. శరీరంలో ఉష్ణాన్ని నియంత్రిస్తుంది .ఆ గాలికి జలుబు, దగ్గు వంటివి దరి చేరవు. కాని వినాయకుడిని తులసి ఆకులతో పూజించకూడదు. దీనికి వేరే పురాణ గాథ ఉంది. తులసి పత్రం పూజయామి అన్న సందర్భంలో అక్షింతలు సమర్పించాలి.
చూత పత్రం : చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హిందువుల గృహం పండుగరోజులలో కనిపించదు. ఇది నోటి దుర్వాసన, చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపసమనం ఇస్తుంది.
కరవీర పత్రం: కరవీర పత్రాన్ని గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది. విష్ణుక్రాంత పత్రం ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రక్తాన్ని విష్ణుక్రాంత అంటారు. దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనలు చేసిన తరువాత ఇది మంచి స్కిన్ కేర్ మందుగా పనిచేస్తుందని వైద్య నిపుణులు తేల్చారు.
దాడిమీ పత్రం: దాడిమీ అంటే దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం.వాంతులు,విరేచనాలు,అరికడుతుంది.శరీరంలో ఉన్నా హానికారక క్రిములను నాశనం చేస్తుంది.
దేవదారు పత్రం: దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. వాంతులు, విరేచనాలు, అరికడుతుంది. శరీరంలో ఉన్నా హానికారక క్రిములను నాశనం చేస్తుంది. మరువక పత్రాన్ని మరువం అని కూడా అంటారు. దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత.ఇది శరీర వేడిని తగ్గిచడంతో పాటు... మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
సింధువార పత్రం: సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అనికూడ పిలుస్తుంటారు. ఇది కీళ్ల నొప్పులకు మంచి మందు.
జాజి పత్రం: జాజి పత్రం... ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క... వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. ఇది చర్మ రోగాలు, స్త్రీ సంభంద వ్యాధులకు మంచి ఔషధకారిణిగా పనిచేస్తుంది. గండలీ పత్రాన్ని దీనినే లతాదూర్వా అనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది. ఇది అతిమూత్ర సమస్యనుంచి ఉపసమనం ఇస్తుంది.
Also Read :- వినాయక చవితి స్పెషల్ : దునియా మొత్తం పోచంపల్లి చీరలంటే ఫిదా
శమీ పత్రం: జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇది నోటి వ్యాధులను తగ్గిస్తుంది. రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం. మన సంప్రదాయం. దీనిలో చాల ఔషధగుణాలు ఉన్నాయి. మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి వుంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది రక్త స్తంభనం, గుండె ఆరోగ్యానికి ఇది చాల సహాయకారిగా ఉంటుంది.
అర్క పత్రం: జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు. నరాల బలహీనత ఉన్నవారికిది. దివ్య ఔషధం. చర్మ వ్యాధులను నివారిస్తుంది. ఇంకా గడ్డలు, పుండ్లు తగ్గటానికి దీని వేరు, బెరడు వాడతారు. తెల్లజిల్లేడు పేరుతో తయారుచేసిన వినాయక ప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం వుంటుందంటారు. ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అప్లైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు.
బదరీ పత్రం: దీనిని రేగు ఆకు అంటారు. ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. ఈ ఆకును మెత్తగా నూరి చర్మానికి పట్టిస్తే చర్మవ్యాధులు దరి చేరవు.
అపామార్గ పత్రం(ఉత్తరేణి): - దగ్గు ,ఉబ్బసంకి బాగా పని చేస్తుంది. దీనికాయలు ముళ్ల మాదిరిగా ఉంటాయి. వీటిని ఎండబెట్టి ఆయుర్వేద మందుల్లో వాడతారు.
గండకి పత్రం(అడవి మొల్ల యుధిక):- అతిమూత్ర సమస్యనుంచి ఉపసమనం ఇస్తుంది. దీని బెరడు నుంచి రసం తీసి వివిధ రకాల మందుల్లో వాడతారు. టానిక్ లాంటి ఔషధాల్లో దీనిని రెండు స్పూన్ లు కలిపుతారు.
అశ్వత పత్రం(రావి ఆకు):- చాల ఓషధగుణాలు ఉన్నాయి.
అర్జున పత్రం(మద్ది ఆకు):- రక్త స్తంభనం,గుండె ఆరోగ్యానికి ఇది చాల సహాయకారి.
విష్ణు క్రాంతం(పొద్దు తిరుగుడు ఆకు):- దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనలు చెబుతున్న దేమిటంటే ఇది మంచి స్కిన్ కేర్ మందుగా పనిచేస్తుంది.
కరవీర పత్రం(గన్నేరు ఆకు):- గడ్డలు, పుండ్లు తగ్గటానికి దీని వేరు,బెరడు వాడతారు
ఆ పత్రితోబాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో, నిమజ్జనం చేయడం. అలా నీటిలో కలిపిన మట్టి, 21 రకాల పత్రి కలిసి 23 గంటలయ్యాక ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కలాయిడ్స్ని ఆ తమలో జలంలోకి వదిలేస్తాయి. అవి బాక్టీరియాను నిర్మూలించి, జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యంగా చెప్పబడింది.