అది బయటైనా... ఇంట్లోనైనా చెప్పులు వేసుకునే నడవడం ఒక ఫ్యాషనైపోయింది. రోడ్ల మీద ఎవరైనా చెప్పులు లేకుండా నడు స్తుంటే, వాళ్లను వింతగా చులకనగా చూస్తారు. కానీ చెప్పులు లేకుండా నడిస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.. అలా నడవడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుందట. ముఖ్యంగా ఉత్త పాదాలతో నడిస్తేనే కాళ్లకు గాయాలు కావంటున్నారు. నడక, శరీర భంగిమ కూడా కరెక్ట్ గా ఉంటాయట.
అందుకే ఇంట్లో, ఆఫీసులో, ఆరుబయట చెప్పుల్లేకుండా హాయిగా తిరగమంటున్నారు శాస్త్రవేత్తలు. ఇదే విషయంపై న్యూయార్కులోని 'ఇథాకా స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండ్ హ్యూమన్ పెర్ఫామె న్స్' కు చెందిన ప్రొఫెసర్ పాట్రిక్ మెక్కెన్ స్పందిస్తూ... "కాళ్ల పాదాల లోని చిన్న, పెద్ద కండరాల మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. వీటి గురించి న్యూరల్ కనెక్షన్ ద్వారా బ్రెయిన్కి సమాచారం చేరుతుంది. పాదాలు, కాళ్లు, కండరాలు దృఢంగా పని చేయాలంటే చెప్పు లేకుండా నడవాలి.
ఇలా చేయడం వల్ల కండరాలు బలపడతాయి. వీటితోపాటు కండరాలు గట్టిపడడానికి రోజూ వ్యాయామం కూడా చేయాలి" అని చెప్పాడు. కానీ చలి కాలంలో మాత్రం చెప్పులు లేకుండా ఉత్త కాళ్లతో నడవడం, పరిగెత్తడం రెండూ మంచివి కాదట. కనీసం సాక్స్ అయినా వేసుకోవాలి.
-- వెలుగు, లైఫ్.