పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ దూసుకుపోతుంది. మొత్తం 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా..ఆరింటిలో టీఎంసీ ఆధిక్యంలో ఉంది. ఈ ఉప ఎన్నికల్లో క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై RG కర్ ఆస్పత్రి డాక్టర్ రేప్ కేసు ఘటన, అవినీతి వంటివి ఒత్తిడి పెంచినా.. తాజా ఉప ఎన్నికల్లో వాటి ప్రభావం ఏమాత్రం చూపలేదని తెలుస్తోంది.
శనివారం ( నవంబర్ 23) ఉదయం కౌంటింగ్ మొదలైనప్పటినుంచి ఆరు స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు తమ హవా కొనసాగిస్తున్నారు. బీజేపీతో సహా ఇతర ప్రతిపక్ష పా ర్టీలు వెనుకంజలో ఉన్నారు.
Also Read : మహారాష్ట్రలో సీఎం పీఠంపై ఉత్కంఠ
హరోవా అసెంబ్లీ సెగ్మెంట్ టీఎంసీ అభ్యర్థి రవీఫుల్ ఇస్లా 22వేల 083 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు తల్దంగ్రాలో ఫల్గుణి సింహబాబు 3వేల 300, నౌహతిలో సనత్ దే 24 వేలు, సితాయ్ లో టీఎంసీ అభ్యర్థి సంగీతారాయ్ లీడ్ లో ఉన్నారు. మదారిహట్ లో టీఎంసీ జయప్రకాష్ టిప్పో, మేదినీపూర్ లో సుజోయ్ హజ్రా ఆధిక్యంలో ఉన్నా రు. ఈ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు లోక్ సభకు ఎన్నిక కావడంతో తిరిగి ఉప ఎన్నికలు వచ్చాయి.