![ప్రేమికుల దినోత్సవం అగ్రిమెంట్ : ఈ కండీషన్స్ చూస్తే నోరెళ్లబెడతారు..!](https://static.v6velugu.com/uploads/2025/02/bengal-couples-valentines-day-agreement-goes-viral_yNn3MpBfHt.jpg)
వాలంటైన్స్ డే.. ఫిబ్రవరి 14 ఈ రోజున బహుమతులు ఇచ్చుకోవడం.. ప్రైవేట్ ప్రదేశాల్లో కలుసుకోవడం... ఇలా సంతోషంగా గడపడం.. కావలసిన వారికి ప్రపోజ్ చేయడం ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ఎంజాయి చేస్తుంటారు. కాని ఇప్పుడు వాలంటైన్స్ డే సందర్భంగా ఓ అగ్రిమెంట్ ఇంటర్నెట్ లో ఓ వార్త వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే....
బెంగాల్ లోని భార్యభర్తలు వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ ఒప్పందం చేసుకున్నారు. భార్యాభర్తల ప్రేమికుల ఒప్పందం సోషల్ మీడియాలో వైరల్ అయింది, దీనిని చూసి ప్రజలు నవ్వడం ఆపుకోలేకపోతున్నారు. ఈ ఒప్పంద పత్రాన్ని రూ. 500 విలువైన నాన్-జ్యుడీషియల్ స్టాంప్ పేపర్‌పై ఇద్దరు సంతకం చేశారు. వారిమధ్య సంబంధాన్ని మెరుగుపరచుకొనేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు.
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా భార్యభర్తలు చేసుకున్న ఒప్పందంలో ఇరువురు వాదించుకోకుండా.. ఒకరిపై మరొకరు ప్రేమాను రాగాలు చూపుతూ జీవితం కొనసాగించాలని రాసుకున్నారు. గతంలో ఉన్న మనస్పర్దలను ఇరువురు తొలగించుకోవాలని ఒప్పందంలో పేర్కొన్నారు.
- ఈ ఒప్పంద పత్రంలో పార్టీ 1 గా పేర్కొన్న శుభం.. పార్టీ 2 అనయను ..మై బ్యూటీకాయిన్..మై క్రిప్టోపీ.. వంటి పేర్లతో పిలవకూడదు. రాత్రి 9 గంటల తరువాత..శుభం యూట్యూబ్ YouTube వీడియోలను ... ట్రేడింగ్ యాప్ లను చూడటం మానుకోవాలి.
- ఈ అగ్రిమెంట్ లో పార్ట్ 2 గా ఉన్నటువంటి అనయ తన సొంత నియమాలను పాటించాల్సి వచ్చింది. శుభమ్ ( పార్ట్ 1) అల్లరి పనుల గురించి అమ్మకు ఫిర్యాదు చేయకూడదు. మాట్లాడుకునేటప్పుడు తన మాజీ గురించి అనయ ప్రస్తావించకూడదు. ఆన్ లైన్ ఫుడ్ యాప్స్ నుంచి ( స్విగ్గి... జోమాటో..) నుంచి కాస్ట్లీ ఐటమ్స్ ఆర్డర్ ఇవ్వకూడదు. అర్దరాత్రి తరువాత ఆర్డర్ చేయకూడదని కొన్ని పరిమితులతో శుభం.. అనయ అనబడే బెంగాలీ జంట ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒప్పందం చేసుకున్నారు.
అగ్రిమెంట్ ప్రకారం నడచుకోకుండా .. ఇరువురులో ఎవరు నియమాలను ఉల్లంఘించినా ఒప్పందం రద్దు చేయబడుతుంది. అంతేకాదు నియమాలనుఉల్లంఘించిన వారు బట్టలు ఉతకడం, బాత్రూమ్ శుభ్రం చేయడంతో పాటు 3 నెలల పాటు ఇంటి పనులకు సహాయం చేయాల్సి ఉంటుందని కూడా ఒప్పందంలో రాసుకున్నారు.
ఈ డాక్యుమెంట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. దీనికి ఫన్నీ రియాక్షన్లు ఇచ్చారు.
ఈ ఒప్పందం చాలా అద్భుతంగా ఉంది... నేను మద్దతు ఇచ్చే అదే అందమైన కలేష్ ఇది.. అని ఒకరు వ్యాఖ్యానించగా.. మరొకరు ,, ఆరోగ్యకరమైన కలేష్ అని రాశారు. . ఇంకొకరు .. ఇది చాలా అందంగా .. ఆకట్టుకునేలా ఉందని రాసుకొచ్చారు. ఒక వినియోగదారుడు మాత్రం... వివాహం అంత కష్టమైనదని ఎవరూ నాకు చెప్పలేదు.... మాకు పెళ్లయి 2 సంవత్సరాలు అయింది, నా భార్య ఇప్పుడు నన్ను ఈ వివాహ ఒప్పందంపై సంతకం చేయమని అడిగింది. ఇప్పుడు ఏమి చేయాలి అని రాశారు.