సంజయ్ రాయ్కి మరణశిక్ష విధించండి.. హైకోర్టులో సీబీఐ పిటిషన్

సంజయ్ రాయ్కి మరణశిక్ష విధించండి.. హైకోర్టులో  సీబీఐ పిటిషన్
  • కలకత్తా హైకోర్టులో సీబీఐ పిటిషన్​

కోల్ కతా: కోల్‌‌‌‌‌‌‌‌కతాలోని ఆర్జీ కర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్ డాక్టర్ రేప్, మర్డర్ కేసులో దోషి సంజయ్‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌ కి సీల్దా కోర్టు విధించిన శిక్షపై సీబీఐ అప్పీల్ కు వెళ్లింది. అతడికి జీవిత ఖైదు విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై దర్యాప్తు సంస్థ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. 

అతడికి మరణశిక్ష విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అంతకు ముందు దోషి సంజయ్ రాయ్‎ కి సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించడాన్ని సవాల్ చేస్తూ బెంగాల్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించగా సీబీఐ వ్యతిరేకించింది. 

కేసును దర్యాప్తు చేసిన ఏజెన్సీగా దోషి శిక్షను సవాల్ చేసే అధికారం సీబీఐకి మాత్రమే ఉంటుందని తెలిపింది. ఈ విషయంలో అప్పీల్ దాఖలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని.. కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని  పేర్కొంది. ఇదిలా ఉండగానే దోషికి మరణశిక్ష విధించాలని సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.