పుణె: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత తెలుగు టైటాన్స్ గెలుపు బాట పట్టింది. కెప్టెన్ విజయ్ మాలిక్ సూపర్ టెన్‌తో విజృంభించడంతో లీగ్‌లో పదో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం ఉత్కంఠగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 34–32తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. టైటాన్స్ తరఫున ఆల్‌రౌండర్ విజయ్ మాలిక్ 11, ఆశీష్ నర్వాల్ 9 పాయింట్లతో మెప్పించారు.
బెంగాల్ వారియర్స్ జట్టులో స్టార్ రైడర్ మణీందర్ సింగ్ (14 ), మంజీత్ (7) సత్తా చాటినా మిగతా ప్లేయర్లు నిరాశ పరిచారు. మొత్తంగా 17 మ్యాచ్‌ల్లో పది విజయాలు, 7 ఓటములతో టైటాన్స్ 54 పాయింట్లతో ఏడు నుంచి నాలుగో స్థానానికి చేరుకుంది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 36–33తో పుణెరి పల్టాన్‌ను ఓడించింది.