తొమ్మిదేళ్ల బాలికరేప్ కేసులో వ్యక్తికి ఉరిశిక్ష

తొమ్మిదేళ్ల బాలికరేప్ కేసులో వ్యక్తికి ఉరిశిక్ష

పశ్చిమ బెంగాల్‌లో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో వ్యక్తికి ఉరిశిక్ష పడింది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 19 ఏళ్ల యువకుడికి శుక్రవారం(డిసెంబర్6)  మరణశిక్ష విధించింది పశ్చిమ బెంగాల్ కోర్టు. 

Also Read :- హైదరాబాద్‎లో ఈ ఆంటీ కనిపిస్తే జాగ్రత్త

పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిభాస్ ఛటర్జీ తెలిపిన వివరాల ప్రకారం.. మొసక్తిన్ సర్దర్ అనే 19 యేళ్ల యువకుడు బాలిక అత్యాచారం హత్య కేసులో అక్టోబర్ 4న అరెస్టయ్యారు. ట్యూషన్ నుంచి తిరిగి వస్తుండగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు..అనంతరం బాలికను హత్య చేశాడని నిర్ధారణ అయింది. దీంతో కోర్టు  మొసక్తిన్ సర్ధార్ కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది..   ఆమె కుటుంబానికి రూ. 10లక్షల పరిహారం కూడా కోర్టు ప్రకటించింది.