Viral Video: మంచి ఆటోడ్రైవర్ అంటే ఇతనే..ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి బంగారం ఇచ్చాడు..!

Viral Video: మంచి ఆటోడ్రైవర్ అంటే ఇతనే..ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి బంగారం ఇచ్చాడు..!

భద్రంగా లాకర్లలో దాచుకున్న సొమ్మును కొల్లగొడుతున్న ఈ రోజుల్లో..దొరికిన సొమ్మును స్వయంగా ఇళ్లు వెతుక్కుంటూ వెళ్లి యజమానులకు అప్పగించే వారున్నారంటే మీరు నమ్ముతారా.. అ లాంటి వారు కూడా ఉన్నారు..వినడానికి ఆశ్యర్యంగానే ఉన్నా..తన ఆటోలో ఓ ప్యాసింజర్ మర్చిపోయిన బంగారు నగలును ఇంటికెళ్లి ఇచ్చాడు ఓ ఆటో డ్రైవర్. బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్..రైడ్ సమయంలో తన ఆటోలో మర్చిపోయిన బంగారం గొలుసును ప్యాసింజర్ ఇంటికెళ్ళి ఇచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బెంగళూరు చెందిన ఆటో డ్రైవర్ గిరీష్  ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల మైసూర్ నుంచి బెంగళూరు వచ్చిన ఓ మహిళ గిరీష్ ఆటోలో ప్రయాణించింది. దిగిపోయే సమయంలో బంగారు గొలుసును ఆటో పోగుట్టుకుంది. రైడ్ అయిపోయాక ఇంటికి చేరుకుని రెగ్యులర్ తనఖి చేసుకోగా బంగారు గొలుసుకు కనిపించింది. గిరీష్ .. ఆ ప్యాసింజర్ ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి బంగారం గొలుసు అప్పగించాడు. దీంతో ఆ మహిళా గిరీష్ ను ప్రశంసలతో ముంచెత్తింది. 

గిరీష్ అడ్రస్ ఎలా తెలుసుకున్నాడంటే.. 

ఆటో అగ్రిగేటర్ నగరా మీటర్డ్  అనే ఆటో యూనియన్ లో గిరీష్ మెంబర్.. ఈ యూనియన్..కస్టమర్ల భద్రతకోసం స్ట్రీట్ హైల్డ్ నగారా మీటర్ ఆటో ట్రిప్ లపేరుతో ఫోన్ నంబర్ తీసుకుంటారు. కస్టమర్లు మర్చిపోయిన లేదా కోల్పోయిన వస్తువులను కనుగొని వారికి అప్పగించేందుకు ఈ విధానం సహాయపడుతుందని గిరిష్ చెబుతున్నారు.    

Also Read:జనం లెక్క తేల్చేద్దాం: కేంద్రం గ్రీన్ సిగ్నల్.. త్వరలో మొదలు

వెతుక్కుంటూ వచ్చి కోల్పోయిన సొమ్మును అప్పగించడంతో ఆ మహిళా కస్టమర్, ఆమె కుటుంబ సభ్యులు ఆటో డ్రైవర్ గిరీష్ కు కృతజ్ణతలు తెలిపారు. గిరీష్ మంచి మనిషి అని పొగిడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.  

 సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అతన నిజాయితీ గల మనిషి నెటిజన్లు కామెంట్లు పెట్టారు.ఇలాంటోల్లు కొద్దిమందే ఉంటారని ప్రశింసించారు.