
సాధారణంగా బెంగళూరు అనగానే హెవీ ట్రాఫిక్ లు, భారీ అద్దెలతో ఎప్పుడూ ఏదో ఒక వార్తతో వైరల్ అవుతూనే ఉంటుంది. అదే తరహాలో ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఐటీ రాజధానిగా పేరుగాంచిన ఈ నగరంలో ఒక వ్యక్తి తన ఆటో-రిక్షా కంపెనీకి సంబంధించి రివ్యూను పంచుకున్నాడు. ఇందులో కంపెనీ పేరును గానీ, ఆ యజమాని పేరును ఎక్కడా ప్రస్తావించకుండా.. సింపుల్ గా తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఆటో వెనకాల రాసి, అందర్నీ మేల్కొలుపుతున్నాడు. Worst vehicle don’t buy అంటూ తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పాడు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X'లో @followdcounsel పేజీలో షేర్ చేసిన ఈ ఆటో-రిక్షా స్నాప్‌షాట్ ఇప్పుడు వైరల్ అవుతోంది, "చెత్త వాహనం కొనుగోలు చేయవద్దు" అనే ఓ ప్రకటనను దాని వెనుక భాగంలో ధైర్యంగా ప్రకటించడం అందర్నీ విశేషంగా ఆకర్షిస్తోంది. సాధారణంగా ఏదైనా కంపెనీని, వస్తువును ప్రమోట్ చేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ దాని వల్ల తాను ఎదుర్కొన్న పరిణామాలను చక్కగా వివరించాడు.
ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ కావడంతో.. నెటిజన్ల దృష్టిని ఎంతో ఆకట్టుకుంది. దీంతో ఇలా రాసిన ఆ ఆటో డ్రైవర్ ను ప్రశంసిస్తూ అందరూ కామెంట్ చేయడం మొదలు పెట్టారు.
ALSO READ : ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ : ముత్యాల సునీల్ కుమార్
What an innovative way to tell others not to buy a bad product! Just #NammaBengaluru things. pic.twitter.com/JaIVYIwEnb
— Ashish Krupakar (@followdcounsel) October 27, 2023