
CEO on Layoffs: ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో అనేక కంపెనీలు తమ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా పేరుకుంటూ మార్కెట్లో జోరుగా తమ కల్చర్ గురించి డప్పు వేసుకుంటున్నాయి. పేరుకే పైపైకి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారనే విషయాన్ని ఏకంగా ఒక కంపెనీ సీఈవో బహిరంగంగా ఎండగట్టారు. ప్రపంచ వ్యాప్తంగా భారీగా కొనసాగుతున్న లేఆఫ్స్ గురించి తనదైన శైలిలో స్పందించారు.
హర్ష్ పోకర్ణ ఓకే క్రెడిట్ కంపెనీ సీఈవో. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ సీఈవో దేశంలో ప్రఖ్యాత ఐఐటీ నుంచి పట్టా పొందారు. అక్కడ ఆయన చదువుతో పాటు సంస్కారవంతమైన పద్ధతులను కూడా నేర్చుకున్నట్లున్నారు. చాలా కంపెనీలు గడచిన ఏడాది కాలంగా తమ ఉద్యోగులను విచక్షణ లేకుండా లేఆఫ్ చేసిపడేస్తున్న పరిస్థితులను తప్పుపట్టారు. పేరుకో ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులు లాంటి వారంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ఏకంగా లక్ష 20 వేల మంది ఉద్యోగులను కంపెనీలు తొలగింపులను కంపెనీలు సరైన పద్ధతుల్లో నిర్వహించకపోవటాన్ని తప్పుపట్టారు. చాలా కంపెనీలు ఈ విషయంలో అమానవీయంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. అయితే ఉద్యోగులను సరైన రీతిలో తొలగింపును కంపెనీలు ఎలా చేపడుతున్నాయన్నదే ముఖ్యమన్నారు. అయితే తనకు కూడా ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దానిని తాను ఎలా నిర్వహించాడనే విషయాన్ని ఈ బెంగళూరు సీఈవో తన లింక్డిన్ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది చదివినవారంతా నువ్వు దేవుడు సామీ, నీ లాంటి వ్యక్తులు సమాజంలో అవసరం అని అంటున్నారు.
సీఈవో ఉద్యోగులను తొలగించిన తీరు సూపర్..
ఓకేక్రెడిట్ కంపెనీ వ్యాపార విస్తరణలో భాగంగా ఉద్యోగులను ఎక్కువగా, వేగంగా నియమించుకుందని సీఈవో పేర్కొన్నారు. అయితే అది పూర్తిగా తమ తప్పేనని ఆయన వెల్లడించారు. అయితే ఈ క్రమంలో 70 మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని, దానిని సరైన పద్ధతిలో తాము నిర్వహించినట్లు పేర్కొన్నారు. ముందుగా ఆ ఉద్యోగులతో విడివిడిగా మాట్లాడి, వారికి కొత్త ఉద్యోగం వచ్చేందుకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. సదరు ఉద్యోగులకు మూడు నెలల నోటీస్ అందించటంతో పాటు వేరే చోట రిఫరల్స్, ఇంట్రోలు, జాబ్ లీడ్స్ ఇవ్వటం ద్వారా 67 మందికి ఉద్యోగాలు వచ్చేలా చేయగలిగామన్నారు. అయితే ఉద్యోగం దొరకని ముగ్గురికి మాత్రం మరో రెండు నెలల పాటు నోటీసు కాలాన్ని పొడిగించి ఆర్థికంగా సపోర్ట్ చేసినట్లు సీఈవో హర్ష పోకర్ణ పేర్కొన్నారు.
Also Read:-ఐఫోన్ లవర్స్‌కి టారిఫ్స్ షాక్.. రూ.2 లక్షలు కానున్న ఆపిల్ ఫోన్..!!
కానీ మరో పక్క అనేక స్టార్టప్ కంపెనీలు తమ వద్ద డబ్బులు బాగా ఉన్నప్పుడు అవసరానికి మించి ఉద్యోగులను తీసుకుని వారిని మధ్యలోనే వదిలేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలో ఫుడ్ డెలివరీ అగ్రిగేషర్ జొమాటో 600 మంది ఉద్యోగులను తొలగించింది.