బ్రేక్ వేయటం మర్చిపోయిన బస్సు డ్రైవర్.. బైకులు, కార్లు ధ్వంసం

బ్రేక్ వేయటం మర్చిపోయిన బస్సు డ్రైవర్.. బైకులు, కార్లు ధ్వంసం

ఆర్టీసీ ఏసీ బస్సు డ్రైవర్ బ్రేక్ వేయటం మర్చిపోయాడు.. అంతే రద్దీ రోడ్డు.. అందులోనూ ఫ్లైఓవర్ బైకులు, కార్లు గుద్దేశాడు. ఈ ఘటన బెంగళూరు సిటీ నడిబొడ్డున ఉన్న.. హెబ్బాల్ ఫ్లైఓవర్ పై జరిగింది. 2024, ఆగస్ట్ 13వ తేదీ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రయాణికులతో వెళుతున్న వోల్వో బస్సు హెబ్బాల్ ఫ్లైఓవర్ పైకి వచ్చింది. 

ఆ సమయంలో ముందూ వెనకా వాహనాలు ఉన్నాయి. ముందు వెళుతున్న ఒక్కసారిగా స్లో అయ్యాయి. ఈ విషయాన్ని గమనించి.. బ్రేక్ వేయాల్సిన బస్సు డ్రైవర్.. బ్రేక్ వేయటం మర్చిపోయాడు. దీంతో ముందు వెళుతున్న బైకులు, కార్లను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు బైక్స్, మూడు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బైక్ పై వెళుతున్న ముగ్గురు గాయపడ్డారు. ఓ బైక్ ప్రయాణికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వోల్వో బస్సులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో యాక్సిడెంట్ స్పష్టంగా రికార్డ్ అయ్యింది. వాహనాలను ఢీకొట్టిన తర్వాత బ్రేక్ వేయటం కనిపించింది. ఆర్టీసీ వోల్వో బస్సు డ్రైవర్ ఏదో ఆలోచిస్తూ.. బ్రేక్ వేయటం మర్చిపోయినట్లు ఉన్నాడు. వాహనాలను ఢీకొట్టిన తర్వాత బ్రేక్ వేయటం వీడియోలో సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తుంది.