పైపులైన్ కో సం తవ్విన గొయ్యిలో పడి చిన్నారి మృతి

బెంగళూరులో నీటి పైపులైన్ కో సం తవ్విన గొయ్యిలో పడి రెండున్నరేళ్ల చిన్నారి చనిపోయింది. ఈ ఘటన మాగడిలోని గొల్లరహట్టి సమీపంలో జరిగింది. బెంగుళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (BWSSB) నీటి పైప్‌లైన్‌ను కోసం పెద్ద గొయ్యిని తవ్వారు. కానీ సంఘటనా స్థలంలో ఎటువంటి హెచ్చరిక బోర్డును ఉంచకపోవడం ప్రమాదానికి దారి తీసింది. భద్రతా చర్యలను విస్మరించిన ఫలితంగా ప్రాణాంతకం సంభవించింది.

పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ BWSSB ఇంజనీర్, కాంట్రాక్టర్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR )నమోదు చేశారు. ఇలాంటి బోర్ వెల్ సంఘటనలు జరుగుతూనే ఉన్నా.. అధికారులు మాత్రం నిర్లక్ష్యంగానే ఉంటుండంపై స్థానికులు ఆగ్రహం వ్యక్చం చేస్తున్నారు. మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఇటువంటి సంఘటనలు తరచుగా వెలుగులోకి రావడంపై మండిపడుతున్నారు. 

గత నెలలో మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో బోర్‌వెల్‌లో పడిపోయిన 7 ఏళ్ల బాలుడు దాదాపు 24 గంటల తర్వాత సహాయక సిబ్బంది బయటకు తీశారు. కానీ  అతను బతకలేకపోయాడు. మార్చిలో జరిగిన మరో సంఘటనలోనూ మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో బోర్‌వెల్‌లో ఐదేళ్ల బాలుడు పడ్డాడు. అతన్ని రక్షించడానికి దాదాపు 9 గంటలు ప్రయత్నించినప్పటికీ.. రెస్క్యూ ఆపరేషన్ ఫలించలేదు.

https://twitter.com/ANI/status/1648176926669041665