ఆమె డెడ్‌బాడీ 30 ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో.. కేసులో కీలక విషయాలు వెలుగులోకి

ఆమె డెడ్‌బాడీ 30 ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో.. కేసులో కీలక విషయాలు వెలుగులోకి

బెంగళూర్ లోని వయాలికావల్‌లో నివసిస్తున్న మహాలక్ష్మీ(29)ని దారుణంగా హత్య చేసి 30కి పైగా ముక్కలు చేసి ఫ్రీజర్‌లో దాచారు. ఆమె ఫొన్ స్విచ్ఛాఫ్ కావడంతో సెప్టెంబర్ 21న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే తరహా ఢిల్లీలో శ్రద్ధా వాకర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహాలక్ష్మీ మడ్డర్ కేసులో కీలక ఆధారాలు బెంగుళూర్ పోలీసులకు లభించాయి. శరీరం ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్‌లో ఉంచారని.. కుళ్లిపోయిన స్థితిలో శరీర భాగాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మహాలక్ష్మి హత్య కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించినట్లు బెంగళూరు పోలీసు కమిషనర్ బి దయానంద సోమవారం (ఈరోజు) తెలిపారు. 

ఈ కేసులో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, ప్రధాన నిందితుడిని గుర్తించామని, అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మీడియాతో  కమిషనర్ దయానంద అన్నారు. కేసు సంబంధించిన మరిన్ని విషయాలు లీక్ చేస్తే నేరస్తులు తప్పించుకుంటారని.. నింధితున్ని పట్టుకున్నాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. 

ALSO READ | ఛత్తీస్‎గఢ్‎లో తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు 8 మంది మృతి

మహాలక్ష్మి గత ఐదు నెలలుగా బెంగుళూరులోని వయాలికావల్‌లోని వినాయక నగర్‌లో ఒంటరిగా నివాసముంటోంది. ఆమె భర్త హుకుమ్​ సింగ్​ నేలమంగళలో ఉంటాడు. వ్యక్తిగత కారణాలతో ఒంటరిగానే జీవిస్తోంది. సెప్టెంబరు 21న మహాలక్ష్మీ నివసిస్తున్న ఇంటి ఫ్రిజ్‌లో ఆమె శరీర భాగాలను కుళ్లిపోయిన స్థితిలో పోలీసులు గుర్తించారు. దుర్వాసన రాకుండా రసాయనాలు చల్లి ఇంటికి తాళం వేసి నిందితులు పరారైయారు. బాధితురాలి ఫోన్ సెప్టెంబర్ 2న స్విచ్ ఆఫ్ అయిందని, అదే రోజు హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.