ఇటీవలి కాలంలో బెంగళూరు నగరం అనేక వినూత్న, విస్మయ ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. పలు విషయాలను హైలైట్ చేసే అనేక ఘటనలు ఇప్పటికే ఇంటర్నెట్ మీమ్‌ల ద్వారా వైరల్ అయ్యాయి. ఇప్పుడు భారతదేశంలోని ఐటీ హబ్‌లో ఆకర్షించే సంఘటనలతో ముడిపడి ఉన్న ''పీక్ బెంగళూరు'' క్షణాల సంఘటనలతో ఇంటర్నెట్ నిండిపోయింది. అదే తరహాలో నగరంలోని ఒక డెలివరీ ఏజెంట్ స్విగ్గి డ్రెస్ కోడ్ నారింజ రంగు టీ-షర్టును ధరించి, జొమాటో డెలివరీ బ్యాగ్‌ని తీసుకువెళ్లడం కనిపించింది. అంతే కాదు అతను పెట్టుకున్న హెల్మెట్ పై లాజిస్టిక్స్ సర్వీస్ స్టార్టప్ అయిన పోర్టర్ లోగో కూడా ఉండడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
మంజు అనే ఇంటర్నెట్ యూజర్ ఎక్స్ లో షేర్ చేసిన ఈ ఫొటోలో.. ఓ వ్యక్తి తన బైక్ ను పార్కింగ్ లోకి తీసుకువెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇందులో అంతను పోర్టర్ లోగో ఉన్న హెల్మెట్, స్విగ్గీ డ్రెస్ కోడ్, జొమాటో బ్యాగ్ తో కనిపించాడు. ఈ ఫొటోను షేర్ చేసిన మంజు.. ఇందుకే నేను బెంగళూరును ప్రేమిస్తున్నానని, ఇది నా అత్యుత్తమ బెంగళూరు మూమెంట్ అని రాశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా పలు రకాలుగా స్పందిస్తున్నారు. విలక్షణమైన బెంగళూరు ప్రవర్తన అని రాసుకొస్తున్నారు.
This is why I love Bengaluru!! This is my peak Bengaluru moment ?
— Manju (@Tanmanaurdhan) January 3, 2024
Holy grail for Startups@peakbengaluru pic.twitter.com/g2k6ZM4K2T