
లివింగ్ కాస్ట్.. ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా ఉంటుంది. ఉదాహరణకు పల్లెలు, పట్టణాల్లో సగటు మనిషి బతకడానికి నెలకు రూ. 5 వేలు ఖర్చవుతుంది అనుకుంటే.. అదే హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీల్లో రూ. 5 వేలతో 10 రోజులు కూడా బతకలేం. ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే ఈ మధ్య బెంగళూరులో లివింగ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటి రెంట్ మొదలుకొని.. గ్రాసరీస్ వరకు ప్రతిదీ దారుణంగా పెరిగిపోయాయని వాపోతున్నారు బెంగళూరియన్స్. తాజాగా ఓ టెకీ లింక్డ్ ఇన్ లో చేసిన పోస్ట్ చుస్తే.. బెంగళూరులో లివింగ్ కాస్ట్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో అర్థమవుతుంది.
రాను రాను.. బెంగళూరు మరింత ప్రియం అవుతోంది.. మీకు కూడా ఇలాగే అనిపిస్తోంది కదూ.. అంటూ హరీష్ అనే ఓ టెకీ తన లింక్డ్ ఇన్ లో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ లో ఇటీవల కాలంలో పెరిగిన నిత్యావసర ధరల గురించి ప్రస్తావించారు హరీష్. పెరిగిన నిత్యావసర ధరలు సామాన్యుడి మీద అదనపు భారం మోపుతున్నాయని.. దీని వల్ల మిడిల్ క్లాస్ పై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు సదరు టెకీ.
పాల నుంచి పెట్రోల్ దాకా అన్నీ పెరిగాయి:
మర్చి 7న నందిని పాల ధర లీటర్ కి రూ. 4 మేర పెరిగిందని.. దీంతో లీటర్ పాల ధర రూ. 47కి చేరిందని అన్నారు. ధర పెరగడమే కాకుండా.. 1050 ml ఉండాల్సిన క్వాంటిటీ కూడా 1000ml కి తగ్గిందని చెప్పుకొచ్చారు. పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెరిగాయని.. అంతేకాకుండా.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, కరెంట్ బిల్లు, గార్బేజ్ ట్యాక్స్, కాఫీ పౌడర్ ఇలా ప్రతి నిత్యావసర వస్తువు ధర పెరిగిందని చెప్పుకొచ్చారు.
►ALSO READ | ప్రకృతి పగబట్టింది: మయన్మార్ లో 4.1 తీవ్రతతో మళ్లీ భూకంపం.. సహాయక చర్యల్లో ఆపరేషన్ బ్రహ్మ
ఇదివరకు మెట్రోలో గరిష్ట ధర రూ. 60 ఉంటే ఇప్పుడు రూ .90కి పెరిగిందని.. దీంతో బెంగళూరు మెట్రో ఇండియాలోనే కాస్ట్లీ మెట్రో అయ్యిందని అన్నారు. ఈ లెక్కన వైట్ ఫీల్డ్, కోరమంగళ లాంటి ఏరియాల్లో ఒక ఫ్యామిలీ బతకాలంటే కనీసం రూ. 40వేలు ఖర్చవుతుందని అన్నారు. ఇదే ఏడాది కిందట ఒక ఫ్యామిలీకి మినిమమ్ ఖర్చు రూ. 25 వేలుగా ఉందని అన్నారు. పెరుగుతున్న ధరలు, చాలీ చాలని జీతం మధ్య మిడిల్ క్లాస్ మనిషి నలిగిపోతున్నాడని అన్నారు.
ఇంటి మెయింటైనెన్స్ కే రూ. 11 వేలు:
హరీష్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. కామెంట్లలో రూపంలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేస్తున్నారు. ఇంటి మెయింటైనెన్స్ కే రూ. 11 వేలు అవుతోందని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. పని మనిషికి కూడా రూ.. 11 వేలు ఇవ్వాల్సి వస్తోందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. లివింగ్ కాస్ట్ విషయంలో బెంగళూరు ముంబైని మించిపోయేలా ఉందని మరో నెటిజన్ కామెంట్ చేశారు.