20యేళ్ల కుర్రోళ్లు నెలకు రూ.1 లక్ష సంపాదిస్తున్నారు..ఎట్లంటే

20యేళ్ల కుర్రోళ్లు నెలకు రూ.1 లక్ష సంపాదిస్తున్నారు..ఎట్లంటే

బెంగళూరు ఇంజనీరింగ్ విద్యార్థుల పంట పండుతోంది. చాలామంది బెంగళూరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంటర్న్ షిప్ ల కోసం నెలవారీ రూ. 1లక్ష స్టైఫండ్ గా భారీ మొత్తాన్ని  సంపాదిస్తున్నారు. ఐఐటీ బెంగళూరు, RV  కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో సహా భారతదేశంలోని ఉన్నత స్థాయి విద్యాసంస్థలు పెద్ద మొత్తమంలో స్టైఫండ్ లను పొందే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.

 RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కు చెందిన 39 మంది విద్యార్థులు ఈ ఏడాది గణనీయంగా నెలకు లక్ష ఎక్కువ సంపాదిస్తున్నారు. గతేడాది ఈ కాలేజీ నుంచి 8 మంది మాత్రమే లక్ష రూపాయల స్టైఫండ్ అందుకున్నారు. ఐఐటీ బెంగళూరు నుంచి టెక్ కంపెనీలు 27 మంది విద్యార్థులను రూ. 1లక్ష లేదా అంతకంటే ఎక్కువ స్టైఫండ్ ఇచ్చాయి. వీటితో పాటు వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సుమారు 30 మంది విద్యార్థులు రూ. 1 లక్ష స్టైపెండ్ ను అందుకున్నారు. 

2024లో Couchbase , అమెజాన్ వంటి కంపెనీలు కూడా రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.20 లక్షల వరకు ఇంటర్న్ షిప్ లను అందించాయి. ఇది భారత దేశంలోని ఉన్నత స్థాయి విద్యాసంస్థల్లో విద్యార్థులకున్న డిమాండ్ ను చూపుతోంది. 
టెక్నికల్ స్కిల్స్, సమస్యల పరిష్కరించే సామర్థ్యం గల విద్యార్థులకు అత్యధిక ఇంటర్న్ షిప్ లను పొందే అవకాశం కల్పిస్తున్నాయి టెక్ కంపెనీలు, అందులో భాగంగా  ఐఐటీ బెంగళూరు, వెల్లూరు  ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(VIT) , RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లలో క్యాంపస్ సెలక్షన్లు నిర్వహించి ఈ స్కిల్స్ ఉన్న విద్యార్థులకు అత్యధిక ఇంటర్న్ షిప్ ఇస్తున్నాయి టెక్ కంపెనీలు. 

ఈ టెక్ సంస్థలతో ఇంటర్న్ షిప్ లను పూర్తి చేసిన చాలా మంది విద్యార్థులు పర్మినెంట్ పోస్టులను పొందారు. భారతదేశంలో టాప్ టెక్ కంపెనీలు సంవత్సరానికి రూ. 40 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు వేతనాలు అందిస్తున్నాయి. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో అయితే సంవత్సరానికి కోటి రూపాయల వరకు అందిస్తున్నాయి.