డ్రైవర్ లేని మెట్రో రైలు వచ్చేసింది

 డ్రైవర్ లేని మెట్రో రైలు వచ్చేసింది

బెంగళూరులో మొదటి డ్రైవర్ లేని మెట్రో రైలు వచ్చేసింది. దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ (CBTC) సిస్టమ్ తో ఈ రైలు నడుస్తుంది. దీంతో మెట్రో రైళ్లకు డ్రైవర్ల అవరం లేకుండా నడపడానికి వీలు కల్పిస్తుంది. ఈఘనత బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు దక్కింది. బుధవారం (ఫిబ్రవరి 14) చైనా నుంచి ఆరు కోచ్ లతో కూడిన తొలి డ్రైవర్ లెస్ మెట్రో రైలు బెంగళూరు కు చేరుకుందని BMRC తెలిపింది.  ఈ కోచ్ లు దక్షిణ బెంగళూరులోని ఐటీ హబ్ ఎలక్ట్రానిక్ సిటీలోని హెబ్బ గోడి డిపోకు చేరుకున్నాయి.

 

 

2020లో దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్లెస్ మెట్రో రైలును ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) జనక్ పురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్ లను కలుపుతూ 38 కిలోమీటర్లు పొడవైన మెజెంటా లైన్ లో తన మొట్ట మొదటి డ్రైవర్ లెస్ రైలు కార్యకలాపాలను ప్రారంభించింది. తొలి డ్రైవర్ లెస్ రైలు ఒక పెద్ద సాంకేతిక ఫీట్ గా చేపట్టింది.  2025 నాటికి దేశవ్యాప్తంగా 18 నగరాలకు మెట్రో రైలు సేవలను విస్తరించపజేస్తామని ప్రకటించారు. 

ఈ డ్రైవర్ లెస్ రైలు BMRCL  ఎల్లో లైన్లో RV రోడ్ నుంచి సిల్క్ బోర్డ్ గుండా ఎలక్ట్రానిక్ సిటీ వరకు నడుస్తుందని అధికారులు చెబుతున్నారు. రైలు , కోచ్ లను చైనా సంస్థ నిర్మించిందని, ఇది BMRCL కోచ్ 216 కోచ్ లను నిర్మించడానికి కాంట్రాక్ట్ పొందిందని రైల్వే అధికారి చెపుతున్నారు.