రైతులనే రానివ్వరా.. జీటీ మాల్ ను మూసివేసిన ప్రభుత్వం

రైతులనే రానివ్వరా.. జీటీ మాల్ ను మూసివేసిన ప్రభుత్వం

బెంగళూరు సిటీలోని ఫేమస్ జీటీ వరల్డ్ మాల్ వ్యవహారంలో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సినిమా టికెట్ ఉన్నా.. రైతును మాల్ లోకి అనుమతించలేదు. రైతు వేషధారణ మార్చుకోవాలని.. ప్యాంట్ వేసుకోవాలి సెక్యూరిటీ సిబ్బంది కండీషనర్ పెట్టటమే కాకుండా.. నెత్తిన తలపాగా, పంచె కట్టుకున్నాడని.. మాల్ లో ఎంట్రీకి ఇది నిబంధన కాదని అనుమతించలేదు.. ఈ వ్యవహారంపై.. కర్నాటక అసెంబ్లీ దద్దరిల్లింది. 

అసెంబ్లీలో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. కార్పొరేట్ వ్యవహారాలు ఇంత దారుణంగా ఉంటాయా.. రైతులకు మాల్ లోకి వెళ్లే అర్హత లేదా.. దేశానికి అన్నం పెడుతున్న రైతుకు.. డబ్బులు పెట్టి మల్టీఫ్లెక్స్ ధియేటర్లలో సినిమా చూసే హక్కు లేదా అంటూ కర్నాటక అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో చర్చ నడిచింది. 

దీనిపై ప్రభుత్వం సిద్ధరామయ్య సర్కార్ స్పందించింది. అర్బన్ డెవలప్ మెంట్ మంత్రి సురేష్ కీలక ప్రకటన చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీటీ మాల్ ను ఏడు రోజులు మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజులు మాల్ మూసి వేయటం ద్వారా.. వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు మంత్రి సురేష్.. 

మంత్రి సురేష్ ప్రకటనపై స్పీకర్ ఖాదర్ స్పందించారు. ప్రభుత్వం ఏ ప్రకటన అయితే చేసిందో.. 7 రోజులు మాల్ వేసినట్లు ప్రకటించిందో.. అందుకు కట్టుబడి చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి ప్రకటనను స్వాగతించారు స్పీకర్ ఖాదర్..