టాలీవుడ్ ప్రముఖ నటి హేమ గత ఏడాది జూన్ లో కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పోలీసులకి చిక్కి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి హేమ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుందని ఆరోపణలు చేస్తూ పోలీసులు ఎన్‌డిపిఎస్ చట్టంలోని సెక్షన్ 27 (బి) క్రింద కేసు నమోదు చేశారు. కానీ నటి హేమ మాత్రం తాను ఎలాంటి మత్తు మందు పదార్థాలు తీసుకోలేదని పలుమార్లు మీడియా ముందుకు వచ్చి మొరపెట్టుకుంది. అలాగే పోలీసుల విచారణలో తెలిపింది.
అయితే గురువారం నటి హేమ కేసుని బెంగళూరు కోర్టు పరిశీలించింది. ఇందులో నటి హేమ తరుపు న్యాయవాది తన క్లైంట్ రేవ్ పార్టీలో ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని కోర్టుకు తెలిపాడు. అలాగే ఇప్పటివరకూ డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలలో కూడా నెగిటివ్ వచ్చిందని కాబట్టి ఆమెపై నమోదు చేసిన కేసు, ఛార్జ్ షీట్ కొట్టివేయాలని వాదించాడు. దీంతో కోర్టు నటి హేమకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇందులోభాగంగా తదుపరి విచారణ వాయిదా వరకూ నటి హేమపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు జరీ చేసింది. అలాగే ప్రభుత్వ తరుపు న్యాయవాది విచారణకి ముందస్తు నోటీసులు ఇవ్వాలని సూచించారు. దీంతో డ్రగ్స్ వ్యవహారంలో కొంతమేర ఊరట లభించిందని చెప్పవచ్చు.
ALSO READ | OTT Movies: 2025 జనవరి ఫస్ట్ వీక్లో.. ఓటీటీల్లోకి రానున్న టాప్-5 సినిమాలివే
ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది జూన్ 3న బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీకి సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో పుట్టినరోజు సాకుతో రేవ్ పార్టీ నిర్వహించారని పక్కా సమాచారం మేరకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) ఫామ్‌హౌస్‌పై దాడి చేసి అక్కడున్న వారి రక్త నమూనాలను సేకరించింది.ఈ రేవ్ పార్టీలో 73 మంది పురుషులు, 30 మంది మహిళలు పాల్గొన్నట్లు ఎఫ్ఐఆర్ వెల్లడించింది. 59 మంది పురుషుల రక్త నమూనాలు డ్రగ్స్‌కు పాజిటివ్‌గా నిర్ధారించగా, 27 మంది మహిళల రక్త నమూనాలు పాజిటివ్‌గా నిర్ధారించబడ్డాయి.