
దేశంలోనే ఐటీ సిలికాన్ వ్యాలీగా, స్టార్టప్ అడ్డాగా పేరు పొందిన బెంగళూరు సిటీ ఇప్పుడు కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఐటీ రంగంలో పెను మార్పులు చర్చనీయాంశం అయ్యాయి. ఐటీ రంగంలో ఉద్యోగాల కోత.. బెంగళూరు సిటీ రియల్ ఎస్టేట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందనే కథనాలు బయటకు వస్తున్నాయి. అసలు బెంగళూరులో ఉద్యోగ సంక్షోభానికి కారణాలు ఏంటో డీటెయిల్డ్ గా చూద్దాం...
బెంగళూరు సిటీలో గత ఏడాది అంటే.. 2024లో అన్ని ఐటీ కంపెనీ కలిసి.. 50 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇది ఇప్పటికీ కొనసాగుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 50 వేల మంది ఐటీ ఉద్యోగులు రోడ్డుపైకి రావటం అనేది ఎవరూ ఊహించని పరిణామంగా చెబుతున్నారు ఆర్థిక, టెక్ నిపుణులు. దీనికి కారణం లేకపోలేదు.. ఐటీ రంగంలో ఏఐ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అన్ని కంపెనీలు ఆటోమెషీన్.. ఏఐ వైపు అడుగులు వేయటంతో.. 50, 60 వేల జీతంతో పని చేసే చాలా మంది ఐటీ నిపుణులు.. తమ ఉద్యోగాలను కోల్పోయారంట. కొత్త ఉద్యోగాలు రాకపోగా.. 2024లో ఒక్క బెంగళూరు సిటీలోనే 50 వేల మంది ఐటీ ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారు.
Also Read:-హైకోర్టునే తప్పుదోవ పట్టించినందుకు కోటి రూపాయల ఫైన్ విధించిన జడ్జి..
రాబోయే రోజుల్లో.. 2025, 2026 సంవత్సరాల్లోనూ ఐటీ రంగంలో ఉద్యోగాల తొలగింపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు కంపెనీలు అడుగులు వేస్తుండగా.. మధ్య, దిగువ స్థాయిలోని ఉద్యోగాలకు ముప్పు వాటిల్లింది. అది ఇప్పుడు బెంగళూరులో స్పష్టంగా కనిపిస్తుందని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఐటీ రంగంలో ఉద్యోగాల తొలగింపు బెంగళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై పడింది. ఇప్పటికే పీజీ హాస్టల్స్, అద్దె ఇళ్లపై ఈ ప్రభావం కనిపిస్తుందంట. ఉద్యోగాలు కోల్పోయిన 50 వేల మంది మరో రాష్ట్రానికి, మరో ప్రదేశానికి షిఫ్ట్ అవుతుండటం.. మరికొందరు సొంతూళ్లకు వెళ్లిపోవటం వంటి కారణాలతో బెంగళూరు సిటీలో పీజీ హాస్టల్స్, అద్దె ఇళ్ల గిరాకీ తగ్గిందంట. అద్దె ఇళ్లపై పెట్టుబడి పెట్టిన వాళ్లపై ఇప్పుడు ఈ ప్రభావం బాగా పడిందంట. అద్దె రేట్లు తగ్గటంతోపాటు పీజీ, ఇతర హాస్టల్స్ లో ఆక్యుపెన్సీ భారీగా తగ్గిందంట. పీజీ హాస్టల్స్, గెస్ట్ హాస్టల్స్ వంటి వాటిలో 35 శాతం స్పేస్ ఖాళీగా ఉంటుందంట. దీంతో ఆదాయం లేకపోగా ఖర్చులు పెరిగి నిర్వహణ అనేది.. యజమానులకు భారంగా మారిందంట. దీనికి కారణం ఐటీ రంగం నుంచి 50 వేల మంది ఉద్యోగాలు కోల్పోవటమే అంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.
బెంగళూరు సిటీలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు, టెక్ పార్కులు, కార్పొరేట్ ఆఫీసులకు అడ్డాగా.. హాట్ స్పాట్ గాఉన్న బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఏరియాల్లో అయితే పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయంట. భవిష్యత్ లో మంచి లాభాలు వస్తాయని కోట్ల రూపాయలు కుమ్మరించిన పెట్టుబడిదారులకు ఇప్పుడు ఆందోళనగా ఉన్నారంట. రోజు రోజులు ఐటీ రంగంలో ఉద్యోగాల రిక్రూట్ మెంట్ తగ్గిపోవటం, ఉన్న ఉద్యోగాలు కోల్పోతుండటంతో అద్దె ధరలు భారీగా తగ్గాయంట. ఇదే క్రమంలో ఆస్తి విలువలు 30 శాతం వరకు తగ్గాయంట. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలోని పెట్టుబడిదారులు ఇప్పుడు ఐటీ రంగంలోని ఉద్యోగ సంక్షోభాన్ని నిశితంగా గమనిస్తున్నారంట.
ఏఐ ప్రభావంతోనే ఈ పరిస్థితులు ఎంత కాలం ఉంటాయి అనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఐటీ రంగం ఎప్పటికి కుదుటపడుతుంది.. రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడు కోలుకుంటుంది అనేది బెంగళూరు సిటీలో చర్చనీయాంశం అయ్యింది