బ్యాచిలర్స్ అంటే అందరికీ లోకువే.. వారికెన్ని కష్టాలో.. అర్థం చేసుకోరూ..

బెంగళూరు.. అత్యంత పెద్ద నగరాలలో ఒకటి. ఈ తరహా సిటీల్లో అపార్ట్ మెంట్ లేదా ఇల్లును అద్దెకు తీసుకోవడం అంటే అత్యంత ఖర్చుతో కూడుకున్నది. ముఖ్యంగా బ్యాచిలర్ గర్ల్స్, బాయ్స్ లాంటి వారికైతే అద్దెకు ఇవ్వాలంటే యజమానులు పెట్టే రూల్స్ లిస్ట్ పెద్దగానే ఉంటుంది. వాళ్లు పెట్టే రిస్ట్రిక్షన్స్ కన్నా... ఒక్కోసారి ఆ ఇల్లు అద్దెకు తీసుకోకపోవడమే బెటర్ అని కూడా అనుకుంటారంటే అతిశయోక్తి కాదు. మరికొందరేమో ఒక్కరున్న వారికి రెంట్ ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాటర్, పవర్.. లాంటివి చాలా తక్కువ వాడుతారు కాబట్టి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పోస్ట్.. బ్యాచిలర్స్ పరిస్థితికి అద్దం పట్టేదిలా ఉంది. ఓ పెద్ద కంపెనీలో పని చేస్తోన్న బ్యాచిరల్.. తన ఇంటిని ఏ విధంగా ఉంచుకున్నాడో ఈ పోస్ట్ లోని ఫొటోలు చెబుతున్నాయి.

అద్దెకుంటున్న వ్యక్తి ముందుగానే 3,-4 నెలల అద్దె చెల్లించాడు. ఆ తర్వాత అతను మళ్లీ కనిపించలేదు. ఆ తర్వాత ఓ రోజు ఆ ఇంటి యజమాని ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఇంటిని ఖాళీ చేయాలని చెప్పాడు. దాంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి ఇస్తానని కోరాడు. ఫ్లాట్‌ను సరిగ్గా ఖాళీ చేయడానికి అద్దెదారు సందేహిస్తున్నాడని గుర్తించిన యజమాని..  ఫ్లాట్‌ను సందర్శించడానికి వెళ్లాడు. ఆ రూం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూసి షాక్ కు గురయ్యాడు. చెత్తకుప్పలా ఉన్న ఆ రూంలను చూసి ఖంగుతిన్నాడు. కిటికీలు తెరిచే ఉంచడంతో  పావురాలు లోపలికి వచ్చి మలవిసర్జన చేసిన ఆనవాళ్లు అతనికి మరింత వికారాన్ని తెచ్చిపెట్టారు. ఎక్కడ చూసినా మద్యం సీసాలు, నేలపై మురికితో ఉన్న పరుపు, వంటగది, మరుగుదొడ్లు.. ఇలా ఒక్కటేమిటీ అన్నీ.. దారుణ స్థితిలో కనిపించాయి.

రెడ్డిట్ లో పోస్ట్ అయిన ఈ విషయాన్ని ఓ ట్విట్టర్ యూజర్ తెలియజేశారు. దాంతో పాటు ప్లాట్‌లోని గదుల షాకింగ్ ఫోటోలను పంచుకున్నారు. అందుకే బ్యాచిలర్లకు అద్దెకు ఇవ్వకూడదు అంటూ ఆ వ్యక్తి క్యాప్షన్ ను జత చేశారు. బాగా చదువుకుని, పెద్ద ఎంఎన్సీ కంపెనీలో పని చేస్తోన్న ఓ వ్యక్తి ఈ పని చేశాడంటూ విమర్శిస్తూ ఆ వ్యక్తి పోస్ట్ లో తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. యజమాని తీసుకున్న డిపాజిట్ నుంచి క్లీనింగ్ ఫీజును మినహాయించుకోవచ్చు కదా అని సూచిస్తూ.. కొందరు కామెంట్లు పెడుతున్నారు. 

https://twitter.com/ravihanda/status/1651157024032583686