దేశంలో ఫేమస్ జర్నలిజం కాలేజీ..అడ్మిషన్లు లేక మూసివేశారు 

దేశంలో ఫేమస్ జర్నలిజం కాలేజీ..అడ్మిషన్లు లేక మూసివేశారు 

అది ప్రముఖ జర్నలిజం కాలేజీ..24 సంవత్సరాలుగా ఎందరో పాత్రికేయులను సమాజానికి అందించిన ఫేమస్ సంస్థ..జర్నలిజానికి పెట్టింది పేరు ఈ కాలేజీ.. అయి తే ఇప్పుడు ఈ కాలేజీ పరిస్థితి దారుణంగా తయారైంది. అడ్మిషన్లు లేక కాలేజీ మూసివేసే పరిస్థితి ఏర్పడింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ జర్నలిజం అండ్ న్యూమీడియా (IIJNM) మూసివేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కాలేజీఎందుకు మూసివేయాల్సి వచ్చింది..? పూర్తి వివరాల్లోకి వెళితే.. 

దేశంలోని ఎలైట్ జర్నలిజం స్కూళ్లలో ఒకటైన బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం అండ్ న్యూ మీడియా.. 2024-25 సంవత్సరానికి గాను జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్లను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం (జూన్ 14)న ప్రకటించింది. ఇనిస్టిట్యూట్ మూసివేతకు విద్యార్థులు ఎవరూ ఈ కోర్సుల్లో చేరకపోవడం, కాలేజీ నిర్హహణకు ఆర్థిక సమస్యలు కారణంగా చెబుతోంది. 

ఫీజు మొత్తాన్ని రీఫండ్ చేయడానికి 2024-25 విద్యాసంవత్సరానికి అప్లయ్ చేసుకున్న విద్యార్థులు తమ బ్యాంక్ వివరాలను ఈమెయిల్ చేరయాలని  IIJNM కోరింది. 
‘‘ఇకపై మేం జర్నలిజంలో ప్రోగ్రామ్ లను అందించబోమనని తెలియజేయడానికి చింతిస్తున్నాం.. ఈ సంవత్సరం ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య అవసరమైన దానికంటే చాలా తక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని విద్యార్థులకు మెయిల్ ద్వారా తెలియజేసింది. 

24ఏళ్లక్రితం బెంగుళూరు లో IIJNM స్థాపించబడింది. ప్రింట్, టెలివిజన్, రేడియో, మల్టీ మీడియా జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా ఇన్ జర్నలిజ్ ప్రోగ్రామ్ లను అందించింది. 

IIJNM ప్రింట్, టెలివిజన్, రేడియో మరియు మల్టీమీడియా జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం ప్రోగ్రామ్‌లను అందించింది.