Viral Video: పప్పీలతో ఈ పిచ్చివేషాలు ఏంటీ..ఈ స్టంట్స్ ఏంట్రా

ఎవడి పిచ్చి వాడికి ఆనందం అని అంటుంటారు..దీనికి ఉదాహరణ ఇదేనేమో.. కుక్కలను పెంచుకుంటారు..ముద్దు చేస్తారు. అది చేసే వింత చేష్టలను ఎంజాయ్ చేస్తుంటాం. కుక్కలతో  రకరకాల విన్యాసాలు చేయిస్తూ మురిసి పోతుంటారు. అవి బార్కింగ్ చేస్తుంటే సంతోష పడిపోతుంటారు.. అయితే వీడిది ఇదేం పిచ్చోగానీ.. కుక్క పిల్లలను కారు టాప్ పై ఉంచి  వేగంగా నడుపుతూ వాటిని ప్రమాదంలోకి నెడుతూ శునకానందం పొందుతున్నాడు. బెంగళూరు కు చెందిన ఓవ్యక్తి చేసిన ఈ పిచ్చి పనులను స్థానికులు వీడియో తీసి నెట్టింట పెట్టడంతో బాగా వైరల్ అవుతోంది.. వీడికి ఇదేం పోయే కాలం అని తిట్టుకుంటున్నారు.. 

బెంగళూరుకు చెందిన హరీష్ అనే వ్యక్తి మూడు కుక్కలను కారు టాప్ ఎక్కించుకుని వెళ్తున్నర వీడియోలు సోషల్ మీడియాలో  వైరల్ కావడంతో స్థానిక పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 

ఇందులో కొసమెరుపు ఏంటంటే.. తన పిచ్చి చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భయంతో గుర్తు పట్టకుండా హరీష్ గుండు గీయించున్నారు. అంతేకాదు.. వీడియో తీసిన వ్యక్తితో గొడవకు దిగాడు..  ఏం చేసినా పోలీసులు ఊరుకుంటారా.. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 

ALSO READ : పగటిపూట టీవీల్లో జంక్ ఫుడ్ యాడ్​లు బంద్

ఇక హరీష్ పిచ్చి చేష్టలపై నెటిజన్లు కొంచెం ఘాటుగా నే స్పందించారు. ఇతరు ప్రాణాలను ప్రమాదంలో పడేసే ఇలాంటి అహంకారపూరిత చర్యలు మంచివి కావు.. చట్టపరంగా ఇతని చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేశారు. 

ట్రాఫిక్ ఉల్లంఘటన, జంతువులను హింసించడం , నిర్లక్ష్యంగా ప్రవర్తించడం,  ఇతరులను దూషించడం వంటి వి చేసినందుకు కేసులు పెట్టాలని నెటిజన్లు రాశా రు.