బీపీ సైలెంట్ కిల్లర్.. లైట్ తీసుకుంటే అంతే సంగతి.. బెంగళూరు సీఈఓ చెప్పేది వినండి

బీపీ సైలెంట్ కిల్లర్.. లైట్ తీసుకుంటే అంతే సంగతి.. బెంగళూరు సీఈఓ చెప్పేది వినండి

అతనో కంపెనీకి సీఈఓ.. శనివారం వీకెండ్ కావడంతో ఇంట్లో రిలాక్స్ అవుతున్నాడు.. ఉన్నట్టుండి ముక్కులో రక్తం కారడం మొదలైంది.. ఎంత ప్రయత్నించినా బ్లీడింగ్ తగ్గకపోవడంతో హాస్పిటల్ కి వెళ్ళాడు.ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించటంతో బ్లీడింగ్ ఆగిపోయింది. కానీ.. అతని బీపీ చెక్ చేసిన డాక్టర్లకు కళ్ళు బైర్లు కమ్మాయి. ఎలాంటి బీపీ లక్షణాలు లేకుండానే అతని బీపీ 230 పైగా నమోదయ్యింది. దీంతో హుటాహుటిన అతన్ని ఐసీయూకి తరలించారు డాక్టర్లు. ప్రమాదకర స్థాయిలో బీపీ ఉండడంతో రెండురోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు డాక్టర్లు.

బెంగళూరుకు చెందిన డేజ్ ఇన్ఫో మీడియా అండ్ రీసర్చ్ కంపెనీ సీఈఓ అమిత్ మిశ్రా ట్రాజెడీ ఇది..  ఎలాంటి లక్షణాలు లేకుండా ఈ రేంజ్ లో బీపీ పెరగడానికి కారణం ఏంటో డాక్టర్లకు సైతం అంతు చిక్కలేదు. దీంతో ఈసీజీ, కొలెస్ట్రాల్, ఆంజియోగ్రఫీ, వంటి కీలక టెస్టులు చేశారు.అన్ని టెస్టుల్లో నార్మల్ అనే వచ్చింది. అమిత్ మిశ్రాకు బీపీ 230 వరకు పెరగడానికి కారణం ఏంటో డాక్టర్లకు కూడా అంతుచిక్కలేదు.

Also Read:-నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే..ప్రాణాంతక వ్యాధులకు ఛాన్స్.. నివారించాలంటే..

రెండురోజులు ఐసీయూలో చికిత్స తర్వాత బీపీ సాధారణం కంటే పడిపోవడంతో తనకు నడవడం కూడా కష్టమవడంతో ఇంకా టెన్షన్ పడ్డాడు అమిత్ మిశ్రా. ఈమేరకు లింక్డ్ ఇన్ లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అమిత్ మిశ్రా పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది. బీపీ సైలెంట్ కిల్లర్ లాగా మనిషిని చంపేస్తుందని.. వర్క్ లైఫ్ బ్యాలన్స్ లేకుండా పనిచేస్తే.. హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. ప్రాణం కంటే పని ముఖ్యం కాదని.. హెల్త్ ని జాగ్రత్తగా ఉంచుకోండి అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు అమిత్ మిశ్రా.

నెటిజన్స్ కు అమిత్ మిశ్రా సూచనలు :​​​​​

ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదు:

ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదని.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అమిత్ సూచించారు.

శరీరం అన్నిసార్లు వార్నింగ్ ఇవ్వదు:

హై బీపీ, స్ట్రెస్ వంటివి సైలెంట్ కిల్లర్స్ అని.. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవాలని అన్నారు అమిత్.

హెల్త్ కేర్ ఆప్షన్ కాదు.. అత్యవసరం:

సైన్స్ కి కూడా అందని మిస్టరీలు చాలా ఉన్నాయనడానికి ఉన్నాయనడానికి తన బీపీ లెవెల్స్ పెరగడం నిదర్శనమని... 15కి పైగా టెస్టులు చేసినా బీపీ పెరగడానికి కారణం ఏంటో అంతుచిక్కలేదని అన్నారు అమిత్.

తనకు లైఫ్ సెకండ్ ఛాన్స్ ఇచ్చిందని రియలైజ్ అయ్యానని... హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక ప్రయారిటీ లిస్ట్ రెడీ చేసుకున్నానని అన్నారు అమిత్.పరిస్థితి చేజారక ముందే జాగ్రత్తపడాలని.. ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్స్ చేఇందుకోవాలని సూచించారు అమిత్.

అమిత్ మిశ్రా లింక్డ్ ఇన్ పోస్ట్ కింద వర్క్ లైఫ్ బ్యాలన్స్ పై పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం మనం లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్ కచ్చితంగా మార్చుకోవాలని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ఏది ఏమైనా..  కార్పొరేట్ ఉద్యోగులకు అమిత్ మిశ్రా కేస్ ఒక వేకప్ కాల్ అని చెప్పాలి.