ఇల్లు అంటే సహజంగా ఓ సింగిల్ బెడ్ రూం లేదంటే డబుల్ బెడ్ రూం.. అదే బ్యాచిలర్స్ గది అంటే మినిమంలో మినిమం ఓ హాలు, వంట గది, బాల్కనీ ఊహిస్తాం.. ఇప్పుడు మీరు వినబోయేది.. చూడబోయే బ్యాచిలర్ ఇంటిని చూస్తే నిజంగా అవాక్కవుతారు. ఇది గది అంటారో.. ఇల్లు అంటారో కూడా అర్థం కాదు. వాస్తవంగా అయితే ఓ ఇంట్లోని స్టోర్ గది.. వేస్ట్ మెటీరియల్ వేయటానికి ఉపయోగించే గది అనుకోవచ్చు.. అలాంటి గదికి ఏకంగా 25 వేల రూపాయల అద్దె వసూలు చేస్తున్నారు. ఇది ఏక్కడో కాదు.. మన బెంగళూరు సిటీలోనే.. ఇంటర్నెట్ లో వైరల్ అయిన ఈ స్టోరీ చూద్దామా..
బెంగళూరు సిటీలోని వైట్ ఫీల్డ్ ఏరియాకు సమీపంలో ఉన్న బిల్డింగ్ అది. అందులో ఓ అగ్గిపెట్టె సైజులో ఉన్న గది. పొడవు 10 అడుగులు, వెడల్పు నాలుగు అడుగులు మాత్రమే. రెండు చేతులు చాపితే.. గదిలోని రెండు గోడలు టచ్ అవుతున్నాయి. కాళ్లు, చేతులను చాపితే పొడవుగా రెండు గోడలు తాకుతున్నాయి. ఇక బాల్కనీ అంటారా ఓ మనిషి హాయిగా నిల్చోవటానికి కూడా వీలులేనంత స్థలం. రెండు, మూడు బకెట్లు పెడితే సరిపోయేంత స్థలం. అది బాల్కనీ అంట. ఇంత చిన్న గదికి అద్దె 25 వేల రూపాయలు అంట.
Also Read :- నోటికొచ్చినట్లు మాట్లాడి..పార్లమెంట్ దాకా పోయింది
ఇంటర్నెట్ లో వైరల్ అయిన ఈ వీడియోను అభిషేక్ సింగ్ అనే వ్యక్తి పోస్ట్ చేశారు. అతని స్నేహితుడు ఐటీ జాబ్ రావటంతో బెంగళూరు షిఫ్ట్ అయ్యాడు. బెంగళూరు సిటీలోని తాను ఉండే ఇంటిని వీడియోలో తన స్నేహితుడికి చూపించడగా రికార్డ్ చేసి.. తన ఇన్ స్ట్రాలో పోస్ట్ చేశాడు అభిషేక్ సింగ్. దీంతో వైరల్ అయింది.
ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. బెంగళూరు సిటీనా మజాకా.. సిటీలో ఉండాలంటే ఈ మాత్రం అద్దె భరించాల్సిందే అని కొందరు అంటుంటే.. బెంగళూరు సిటీలో బతకలేం అని మరికొందరు అంటున్నారు. బెంగళూరు సిటీలో ఫ్యామిలీకి ఇల్లు కావాలంటే లక్ష రూపాయలు అద్దె ఉంటుందా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. బెంగళూరులో ఉద్యోగం అంటే ఇంటి అద్దెల కోసమే ఉద్యోగం చేయాలా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఏదిఏమైనా బెంగళూరు సిటీలో అద్దె ఇల్లు అంటేనే భయపడిపోతున్నారు.