మనిషేనా వీడు : దళిత యువకుడిని ప్రేమించిందని.. కూతురిని చంపేసిన తండ్రి

మనిషేనా వీడు : దళిత యువకుడిని ప్రేమించిందని.. కూతురిని చంపేసిన తండ్రి

బెంగళూరు: కులం కుత్తుక కోసింది. 20 యేళ్లు పెంచిన తండ్రి కాల యముడయ్యాడు. పరువు కోసం కన్న కూతురునే అతి కిరాతకంగా చంపేశాడు. కులం మత్తులో పడి ఇన్నాళ్లు అల్లారుముద్దుగా పెంచిన కన్న పేగును కడతేర్చాడు. కుటుంబ పెద్దగా తను చేసిన ఘోరంతో రేపు  ఆ కుటుంబం పరిస్థితి ఏంది ఏమీ ఆలోచించలేదు.. ఏం సాధించాడు.. పరువు కోసం కన్న బిడ్డను కడతేర్చి ఏం సాధించాడు. ఇప్పుడు కటకటాలు లెక్క పెడుతున్నాడు. వేరే కులం వ్యక్తిని ప్రేమించిం దన్న కారణంతో 20యేళ్ల యువతి సొంత తండ్రి  చేతిలో హత్యకు గురైన దారణ ఘటన కర్ణాటలోని బెంగళూరు సమీపంలోని బిదలూరులో జరిగింది. 

వివరాల్లోకి వెళితే..బిదలూరుకు చెందిన కవన అనే ఎస్సీ కులానికి చెందిన 20 యేళ్ల యువతి అదే గ్రామానికి చెందిన మరో కులం యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయంలో తెలిసిన ఆమె తండ్రి మంజూనాథ్ పరువుపోతుందని తీవ్ర మనస్థాపానికి గురై..కవన ప్రేమను అడ్డుకున్నాడు.. మరో వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చాడు. దీంతో తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని తండ్రిని ఎదిరించి మొండిగా నిరాకరించింది. 

Also Read :- వందే భారత్ పై రాళ్ల దాడి

పరిస్థితిని అదుపులో ఉంచుకోవాలని చూసిన మంజునాథ్.. కవన తో పెళ్లి కుదిర్చిన అబ్బాయితో అతని చిన్న కూతురికి పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేశాడు.  బలవంతపు పెళ్లి కీర్తనకు ఇష్టం లేకపోవడంతో పరిస్థితి మరో వివాదానికి దారి తీసింది. 
ఈ విషయాన్ని అక్క కవనకు తెలపడంతో సాయం కోసం ఒక NGOని సంప్రదించింది. దీంతో కీర్తన వివాహం కూడా ఆగిపోయింది. అయితే దీనంతటికీ కారణం కవన అని మంజూనాథ్ కోపం పెంచుకున్నాడు. గురువారం తెల్లవారు జాము కత్తితో కవన గొంతు కోసి హత్య చేశాడు.. అనంతరం పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు. ఘోరమైన నేరాన్ని అంగీకరించాడు. అతనిని అరెస్టు చేసి ఐపీసీ సెక్షన్ 302 (హత్యకు శిక్ష) కింద కేసు నమోదు చేశారు.