బెంగళూరు ఎలక్ట్రానిక్ క్యాపిటల్ మాత్రమే కాదు..ఎన్నో వింతలకు కేరాఫ్ అడ్రస్..దేశంలో అత్యంత బిజీ నగరాల్లో బెంగళూరు ఒకటి..నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉంటుంది.. ట్రాఫిక్ లో డైలీ రోటీన్ పనులు చేసుకుంటూ ఉండే బెంగళూరు నగర వాసుల వీడియోలు సోషల్ మీడియాలో మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. సిలికాన్ సిటీలో ఉపాధికి కొదవలేదుగానీ..హౌజ్ రెంట్స్, లివింగ్ కాస్ట్ లతో కూడా బెంగళూరు నగరం రికార్డులు సృష్టిస్తోంది..ఎన్నో వింతలు విశేషాలకు నిలయం అయిన బెంగళూరు సిటీకి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ ను షేర్ చేశాడు. ఆ పోస్ట్ ను చదివితే మీరు అవాక్కవడం ఖాయం..
బెంగళూరు నివాసి రెడ్డిట్ లో చేసిన పోస్ట్ కు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 27 యేళ్ల బెంగళూరు వ్యక్తి తన పోస్టులో ఇలా రాశాడు. ‘‘ తన ఇంట్లో పనిచేసే వంటవాడు చాలా కాస్ట్ లీ.. తాను కూడా సొంతంగా ఓ వంటివాణ్ని పెట్టుకున్నాడు.. అంతేకాదు.. ఆ వంటివాడికి కూడా ఇంటిపనులు, వంట చేసేందుకు ఇంకో మనిషి ఉన్నాడు అని’’ రాశాడు.
ALSO READ | మత్తు వదలరాలో కూడా ఇన్ని ట్విస్ట్లు లేవు కదయ్యా..! చెన్నైలో ఏం జరిగిందంటే..
తన ఇంటిని శుభ్రం చేసేందుక పనిమనిషి కోసం వంటవాడిని అడిగే క్రమంలో ఈ పోస్ట్ పెట్టిన వ్యక్తి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకున్నాడు. తన వంటవాడి ఇంటి పనులకోసం పనిమనిషి, వంటమనిషిని కలిగి ఉన్నాడని.. పనిమనిషికి రూ. 2వేలు, వంటవాడికి రూ.2500 లు ఇస్తున్నట్లు చెప్పాడు.
రెడ్డిట్ పోస్ట్ కు నెటిజన్లు రకరకాల కామెంట్లతో స్పందించారు. మీ వంటవాడు కుక్ సిబ్బంది బిజినెస్ చేస్తున్నాడు.. తన క్లయింట్లకు కేటాయించే ముందుకు ట్రైనీ కుక్ లను 20 శాతం కమిషన్ తో తన ఇంట్లో మూడు నెలలపాటు పనిచేస్తారు అని రాశాడు.
మరో నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. వంటి మనిషికి వంట మనిషి ఉందా.. అంటు అవాక్కయ్యాడు. మరో నెటిజన్ స్పందిస్తూ నా గత డ్రైవర్ స్కోడా కారులో వచ్చేవాడు అని రాశాడు. చివరగా ఓ వ్యక్తి ఇలా రాశాడు. ‘‘ కుక్ కుక్ కుక్ కూడా ఉన్నట్లు ఊహించుకోండి.. అందరూ వంటచేసేవాళ్లే కానీ వారి ఇళ్లలో మాత్రం కాదు అని చమ్కరించాడు.