మెట్రో స్టేషన్లో ఇదేం పనిరా బాబు.. లవర్స్ చేసిన పనికి తిట్టనోళ్లంటూ లేరు.. వీడియో వైరల్

మెట్రో స్టేషన్లో ఇదేం పనిరా బాబు.. లవర్స్ చేసిన పనికి తిట్టనోళ్లంటూ లేరు.. వీడియో వైరల్

పబ్లిక్ ప్లేస్ లలో లవర్స్ చేస్తున్న పనులు ఒక్కోసారి చాలా చికాకు తెప్పిస్తుంటాయి. చుట్టూ ఎవరైనా ఉన్నారా.. చూస్తే ఏమనుకుంటారు అనే కామన్ సెన్స్ లేకుండా చెలరేగి పోతున్నారు. మెట్రోలో అయితే మరీ ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరు చూస్తే మాకేంటి.. అన్నట్లుగా జుగుప్సాకరంగా ప్రవర్తిస్తూ సాటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని కంప్లైంట్ వచ్చిన తర్వాత.. అలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు బెంగుళూరు మెట్రోలో కూడా జరుగుతున్నాయి. ఇటీవల బెంగళూరు మెట్రోలో లవర్స్ చేసిన పనికి తిట్టనోళ్లంటూ లేరు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. 

ఒక జంట మెట్రో స్టేషన్ లో రొమాన్స్ చేస్తున్న వీడియో ‘కర్ణాటక పోర్ట్ ఫోలియో’ అనే ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో పోస్ట్ అయ్యింది. ‘‘బెంగళూరు మెట్రో కూడా  ఢిల్లీ మెట్రో కల్చర్ కు అలవాటు పడుతోంది’’ అంటూ క్యాప్షన్ తో వీడియో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

లవర్స్ రొమాన్స్ చేసుకుంటున్న 30 సెకండ్ల ఈ వీడియోలో అమ్మాయి టీ షర్ట్ లోకి అబ్బాయి చేతులు పెడుతున్నట్లుగా ఉంది. మెట్రో ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఈ జంట .. పక్కనే ఇతర ప్యాసెంజర్లు ఉన్నప్పటికీ ఎలాంటి మొహమాటం లేకుండా ప్రవర్తించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 

Also Read:-కోటి రూపాయల ఇంటి కోసం సవతి తల్లి ఘాతుకం..

సోషల్ మీడియాలో దీనిపై నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్స్ పెడుతున్నారు. ‘‘కేవలం బెంగళూర్ మెట్రోలోనే ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతాయి. హైదరాబాద్, చెన్నై మెట్రోల్లో ఎందుకు జరగడం లేదు’’ అని ఒకరు కామెంట్ పెట్టారు. 

మరి కొందరు.. నార్త్ ఇండియా నుంచి వచ్చిన మైగ్రెంట్స్.. సౌత్ కల్చర్ ను దెబ్బతీస్తున్ననారని పోస్ట్ పెట్టారు. 

మొరాలిటీ గురించి మాట్లాడే వాళ్లు వాళ్ల ఫేస్ లు బ్లర్ చేయకుండా వీడియో అప్లోడ్ చేయాలని మరొకరు పోస్ట్ పెట్టడాన్ని చాలా మంది సమర్ధిస్తున్నారు. 

బెంగళూర్ మెట్రో స్టేషన్ అడవికంటే ఘోరంగా మారింది. నో షేమ్.. నో హ్యుమానిటీ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

‘‘కాస్తైనా సిగ్గుండాలి బ్రదర్.. కొంతైనా డీసెన్సీ ఉండాలి. ఆ అమ్మాయి మైనర్ లా ఉంది. చర్యలు తీసుకోవాల్సిందే’’ అని మరో నెటిజన్ డిమండ్ చేశాడు.