మీషోలో తెగ ఆర్డర్లు పెడుతుంటారా.. ఈ ముగ్గురూ ఏం చేశారో చూడండి..!

మీషోలో తెగ ఆర్డర్లు పెడుతుంటారా.. ఈ ముగ్గురూ ఏం చేశారో చూడండి..!

బెంగళూరు: ఈ-కామర్స్ షాపింగ్ వెబ్సైట్ మీషో(Meesho) గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. చౌక ధరల్లో ప్రొడక్ట్స్ అమ్ముతూ అతివలను ఆకర్షించడంలో మీషో ముందుంటుంది. మహిళలు ఎక్కువగా వినియోగించే మీషో వెబ్సైట్ సంస్థను గుజరాత్కు చెందిన ముగ్గురు కేటుగాళ్లు మోసం చేశారు. మీషో కళ్లుగప్పి ఫేక్ సెల్లర్గా మారి రూ.5.5 కోట్లకు మోసం చేశారు. ఏడు నెలలుగా మీషో సంస్థను మోసం చేస్తూ బెంగళూరు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

‘‘ఓం సాయి ఎంటర్ప్రైజెస్’’ పేరుతో సూరత్లో ఈ నిందితులు ముగ్గురూ ఒక ఫేక్ కంపెనీని క్రియేట్ చేశారు. థర్డ్ పార్టీ ఏజెంట్లతో కలిసి మీషోను మోసం చేశారు. బోగస్ కస్టమర్ అకౌంట్స్ క్రియేట్ మీషోలో రోజుకు 2వేల నుంచి 2500 వరకూ డైలీ ఆర్డర్స్ చేసేవారు. ఫేక్ నేమ్స్, ఫేక్ అడ్రసులతో ఆర్డర్ చేస్తారు. ఫేక్ అడ్రసులు కావడంతో ప్రొడక్ట్స్ రిటర్న్ అయి సెల్లర్ కంపెనీ అయిన వీళ్ల దగ్గరకు చేరేవి. అలా రిటర్న్ అయిన ప్రొడక్ట్స్ను డ్యామేజ్ అయిన వాటితో భర్తీ చేసి, మీషోను నమ్మించడానికి వీడియో కూడా తీసి పంపించేవారు. రిఫండ్స్ క్లైమ్ చేసేవారు.

Also Read:-మీరు కొన్న బట్టల ఖరీదు రూ. 1,500 దాటిందా.. 

ఇలా.. 2024 జనవరి నుంచి జులై వరకూ రకరకాల బ్యాంకు అకౌంట్లతో 5.5 కోట్లు రిఫండ్ రూపంలో ఈ మోసగాళ్లు సొమ్ముచేసుకున్నారు. మీషో నోడల్ ఆఫీసర్కు డౌట్ వచ్చి నిఘా పెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేయగా ఈ కేటుగాళ్ల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. నిందితులు వినియోగించిన బ్యాంకు అకౌంట్ల వివరాలను, ఫోన్ నంబర్లను పోలీసులు సేకరించారు. నవంబర్ 21న ఈ కేసులో అనుమానితుడిని సూరత్లో అరెస్ట్ చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా తనతో పాటు ఈ క్రైంలో భాగమైన మరో ఇద్దరి గురించి కూడా నిందితుడు బయటపెట్టాడు. 2023లో కూడా ఈ నిందితులు ఇదే తరహా మోసానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది.