
ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ. 854 కోట్ల మోసానికి పాల్పడ్డారు సైబర్ నేరగాళ్లు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని ఆశ చూపి కేటుగాళ్లు ఏకంగా రూ. 854 కోట్లు కొట్టేశారు. మోసపోయామని గ్రహించే సరికి..సైబర్ నేరగాళ్లు ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. ఈ ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.
బెంగుళూరులో కొందరు సైబర్ నేరగాళ్లు తక్కువ పెట్టబడితో ఎక్కువ లాభం పొందని బాధితులను నమ్మించారు. రోజుకు రూ. 1000 నుంచి రూ. 5000 వరకు లాభం పొందొచ్చని మాయమాటలు చెప్పారు. నిందితులు వాట్సాన్. టెలిగ్రామ్ ద్వారా బాధితులకు వివరాలు పంపించారు. నిందితుల మాటలను నమ్మికన వ్యక్తులు..రూ. 1000 నుంచి రూ. 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. బాధితులు పెట్టుబడి సొమ్మును సైబర్ నేరగాళ్లు బ్యాంకులో జమ చేసినట్లు చూపించారు. సొమ్ము పూర్తిగా బ్యాంకుల్లో జమ అయినట్లు నమ్మించారు. ఆ నెలకు పెట్టుబడి పెట్టిన సొమ్ముకు అదనంగా డబ్బు డ్రా చేసుకోవాలని సూచించారు. అయితే బాధితులు డబ్బును విత్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తే ఒక్క రూపాయి కూడా రాలేదు. దీంతో లబోదిబో మన్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read:- ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. రూ.2వేల నోటు మార్పిడికి గడువు పొడిగింపు
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..అరుగురిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా రూ. 5 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. అయితే బాధితుల నుంచి డబ్బును వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు..డబ్బును మ్యూల్ ఖాతాలకు మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. క్రిప్టో, పేమెంట్ గేట్ వే, గేమింగ్ యాప్ ల ద్వారా రూ. 854 కోట్లు వివిధ ఆన్ లైన్ పేమెంట్ మోడ్ లోకి డంప్ చేశారని పోలీసులు వెల్లడించారు.