వాకింగ్ చేస్తుండగా..కరెంట్ స్తంభం మీదపడి నాలుగు నెలల గర్భిణి మృతి

వాకింగ్ చేస్తుండగా..కరెంట్ స్తంభం మీదపడి నాలుగు నెలల గర్భిణి మృతి

ఊహించని ఘటన.. ప్రమాదం రూపంలో ఒక్కసారిగా విరుచుకుపడ్డ కరెంట్ పోల్..అప్పటివరకు యాక్టివ్ గా వాకింగ్ చేస్తున్నవాళ్లు..అంతలోనే నిర్జీవులుగా మారారు. మిగతా వాకర్స్ చూస్తుండగానే అంతా జరిగిపోయింది. విద్యుత్ స్తంభం మీదపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన బెంగళూరులో జరిగింది. మృతుల్లో ఒకరు నాలుగు నెలల గర్భిణీ కావడం అందరిని కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. 

మంగళవారం (మార్చి18) బెంగళూరులోని బ్యాప్పనహళ్లి ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుండగా జెసిబి యంత్రం ప్రమాదవశాత్తు లైట్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో తమిళనాడుకు చెందిన సుమతి, బీహార్ కు చెందిన నాలుగు నెలల గర్భినీ సోని కుమారి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన జేసీబీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.