దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు

దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య పెరుగుతోంది. కర్నాటకలో రికార్డు స్థాయిలో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 21,390 మందికి కరోనా నిర్థారణ అయింది. వారిలో 15,617 మంది బెంగళూరుకు చెందిన వారు ఉన్నారు. బెంగళారులో నిన్న నమోదైన కేసులతో పోలిస్తే ఈ సంఖ్య 44శాతం ఎక్కువ.  కర్నాటకలో గత 24 గంటల్లో 1541 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. 10 మంది చనిపోయారు. ప్రస్తుతం కర్నాటకలో 93,099 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 27,561 మందికి కరోనా సోకింది. కోవిడ్ కారణంగా ఇవాళ 40 మంది చనిపోయారు. ప్రస్తుతం ఢిల్లీలో 87,445 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మహారాష్ట్రలో మొత్తం 46,723 మంది కోవిడ్ బారిన పడ్డారు. 24 గంటల్లో 28,041 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 32 మంది చనిపోయారు. ఇక ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబైలో ఈ రోజు 16,4240 కరోనా కేసులు నమోదయ్యాయి. 14,646 మంది రికవర్ కాగా.. వైరస్ కారణంగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. 

బెంగాల్ లో కొత్తగా 22,155 మందికి కరోనా నిర్థారణ అయింది. 23 మంది చనిపోయారు. 1,16,251 యాక్టివ్ కేసులున్న బెంగాల్ లో పాజిటివిటీ రేటు 30.86 శాతంగా ఉంది.